Dating: చిత్రం సినిమా చూశారా… ఉదయ్ కిరణ్, రీమా సేన్ కాలేజీలో ఉండగానే ప్రేమలో పడతారు.. శారీరకంగా కలుస్తారు. రీమాసేన్ గర్భం దాల్చుతుంది.. ఆ గర్భంతోనే కాలేజీకి వెళుతుంది.. అప్పట్లో ఈ చిత్రం ఒక సెన్సేషన్.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులే కాస్త అటు ఇటుగా నెలకొన్నాయి. ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు పెద్దలు. కానీ ఈ తరం పిల్లలు ఏమాత్రం ఆగడం లేదు. “టీన్” ఏజ్ లోనే అన్నీ చూసేస్తున్నారు.. అన్నీ కానిచ్చేస్తున్నారు. వెరసి ఇవి సమాజంలో పెడపోకడలకు దారితీస్తున్నాయి.
ఇటీవల అమెరికాలో కాలేజీల్లో అంటే +2 స్టాండర్డ్ స్కూళ్లలో చిన్నపిల్లల అరుపులు ఎక్కువైపోయాయి. విషయం ఏమిటా అని ఆరా తీస్తే అక్కడ కౌమార దశలో ఉన్న పిల్లలు ఆ అనుభవాన్ని చూస్తున్నారు. అమెరికన్ చట్టాల ప్రకారం కౌమార దశలో ఉన్న పిల్లలు విడిగా ఉంటారు. దీంతో తల్లిదండ్రుల అజమాయిషీ వారిపై తగ్గుతుంది. దీనివల్ల పిల్లలు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. పైగా వారికి అపరిమితమైన స్వేచ్ఛ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రేమలో పడటం, నచ్చిన భాగస్వామితో శారీరకంగా కలవడం, గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం చకచకా జరిగిపోతున్నాయి. అసలే కాలేజీకి వెళ్లే యువత కాబట్టి.. తాము కన్న పిల్లల్ని కూడా వారి వెంట తీసుకెళ్తున్నారు. దీంతో కాలేజీ తరగతులు మొత్తం చిన్నపిల్లల అరుపులతో హోరెత్తిపోతున్నాయి. ఈ పరిణామం అమెరికా చట్టసభల్లో చర్చకు వచ్చిన నేపథ్యంలో.. ఇలాంటి వ్యవహారాలపై కొత్త చట్టాలు తీసుకురావాలని చట్టసభల్లో నేతలు అభిప్రాయపడ్డారు.. మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
అమెరికా మాత్రమే కాదు మన దగ్గర కూడా ఇటువంటి వ్యవహారాలకు తక్కువేమీ లేదు. మొన్నటికి మొన్న తెలంగాణలోని నారాయణఖేడ్ గురుకుల పాఠశాలలో ఇంటర్ చదివే ఓ బాలిక వాష్ రూమ్ లో ప్రసవించింది. ఆ శిశువు పోవడంతో, అక్కడ సమీప ముళ్ళ పొదల్లో పడేశారు. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే గురుకుల పాఠశాలలో చదివే బాలిక గర్భం దాల్చి, వాష్ రూం లో ప్రసవించడంతో, ఆ పాఠశాలకు చెందిన నర్స్, ప్రిన్సిపాల్ దీనిని మూడో కంటికి తెలియకుండా చనిపోయిన శిశువును ముళ్లపొదలో పడేయించారని తెలిసింది. అయితే సదరు బాలిక గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడిందని తెలిసింది. సెలవుల నిమిత్తం బాలిక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ యువకుడు, బాలిక శారీరకంగా కలిసే వారిని, అందుకే గర్భం దాల్చిందని పోలీసుల విచారణలో తేలింది. అయితే బాలిక గర్భం దాల్చిన విషయాన్ని దాచినందుకుగాను పాఠశాల ప్రిన్సిపాల్ పై ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది.
ఇక ఆ మధ్య అబ్దుల్లా పూర్ మెట్ లో నవీన్ ను హరిహర అనే వ్యక్తి అత్యంత కీచకంగా హత్య చేశాడు గుర్తుంది కదా. అయితే హరిహర ప్రేమించిన నిహారిక.. అంతకుముందు నవీన్ తో ప్రేమలో పడింది. ఇద్దరు శారీరకంగా కలిసేవారు. అయితే ఎప్పుడైతే నవీన్ దూరం పెడుతున్నాడని భావించిందో.. అప్పుడే హరిహర కు దగ్గర అయింది. అతనితోనూ పడక సుఖం పంచుకుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
అంటే ఇటువంటి పరిణామాలు పెడధోరణి పడుతున్న యువత తీరును కళ్ల ముందు కడుతున్నాయి. మొన్నటిదాకా పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఇటువంటి సంస్కృతి ఉండేది. రాను రాను మనదేశంలోనూ అటువంటి కల్చర్ కనబడుతోంది. పైగా ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో 16 సంవత్సరాలకే యువత ఆ అనుభవం కోసం వెంపర్లాడుతున్నారని తేలింది.. అరచేతిలో స్మార్ట్ఫోన్ ఉండటం, తల్లితండ్రులు అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడం ఇందుకు కారణాలుగా తేల్చి చెప్పింది.. ముందుగానే మనం చెప్పుకున్నట్టు ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. కానీ ఇప్పటి యువతకు అంత ఓపిక ఉండటం లేదు. అప్పటిదాకా ఎదురు చూసేంత సహనం వారిలో ఉండటం లేదు.