
Viral Video : ఆవు అంటే సాధు జీవి. మన పురాణాల నుంచి ఇప్పటివరకు ఆవు గురించి చెప్పమంటే అలానే చెబుతారు. పైగా ఆవుకు కామధేనువు అనే పేరు కూడా ఉంది. అందుకే గృహప్రవేశాలప్పుడు, ఇతర శుభకార్యాల్లో ఆవులను ప్రత్యేకంగా పూజిస్తారు.. ఇంకా కొందరైతే ఆవులను ప్రత్యేకంగా పెంచుకుంటారు.. కానీ అలాంటి సాధు జీవి అయిన ఆవుకు కోపం వస్తే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూసారా? తన దూడను తినేందుకు వచ్చిన పులిని వెంబడించడం ఎప్పుడైనా తిలకించారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి.. మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం.
ఇటీవల కాలంలో అడవులు తగ్గిపోయాయి. కాలుష్యం పెరిగిపోయింది. దీనికి తోడు క్వారీల వల్ల గుట్టలు కూడా కరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వాటినే ఆవాసంగా చేసుకున్న జంతువులు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నాయి. వీటిల్లో కొన్ని జాతులు చనిపోతుండగా, మరికొన్ని మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయి. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేవి కోతులు. ఇటీవలి కాలంలో కోతులు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే అక్కడక్కడ పులులు కూడా ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల ఒక హైవే మీద చిరుతపులి పడుకొని ఉంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న వ్యక్తిని చూసి భయపడి పారిపోయింది. ఇక తాజాగా జనావాసాల్లోకి ఒక పులి వచ్చింది. ఆ గ్రామంలోని ఆవులను, దూడలను వెంబడించింది. ఒంటరిగా ఉన్న ఒక దూడను తినేందుకు ప్రయత్నించింది.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశంత నంద తన ట్విట్టర్లో షేర్ చేశారు.
ఓ గ్రామంలోని బంజరు భూమిలో ఒక రైతుకు చెందిన పశువులపాక ఉంటుంది. ఆ పాకలో గోవులు, దూడలు ఉంటాయి. వాటిని మేత కోసం ఆ రైతు వదిలిపెడతాడు. అయితే ఇదే సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న ఓ పులి ఆవులను వెంబడిస్తుంది.. ఇదే క్రమంలో ఒక దూడ అక్కడే ఉంటుంది. ఆ దూడను గమనించిన పులి దానిని చంపి తినేందుకు ప్రయత్నిస్తుంటుంది.
కానీ వెంటనే తన దూడకు జరుగుతున్న దారుణాన్ని పరిశీలించిన ఆగు వెంటనే తిరిగి పరిగెత్తుకుంటూ వస్తుంది. తన దూడ అరుపులు విని చలించిపోతుంది.. ఎదుట ఉన్నది పులి అని తెలిసినప్పటికీ ఎదురుదాడికి దిగుతుంది.. దానిని తరిమి తరిమి కొడుతుంది. ఆవు దూకుడు తట్టుకోలేక పులి పారిపోతుంది. అన్ని ఆవులను పరిగెత్తించిన పులి ఒక్క ఆవు ఎదురు తిరగడంతో పారిపోతుంది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. అయితే ఈ వీడియో పట్ల నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. ఇక అటవీ శాఖ అధికారి సుశాంత నంద ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ” దేశంలో ఆపరేషన్ టైగర్ పేరిట కేంద్ర ప్రభుత్వం పులుల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించింది. అందుకే దేశంలో పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం వీటి సంఖ్య మూడువేలకు చేరింది.. దానికి ఉదాహరణే ఈ పులి జనావాసాల్లోకి రావడం” అంటూ కామెంట్ చేశాడు.
India now has 75% of world’s wild tigers, numbering around 3200.
It will reach it’s carrying capacity soon, until we are obsessed with numbers & make them pests in human dominated habitats. pic.twitter.com/otdEBjA3AP— Susanta Nanda IFS (Retd) (@susantananda3) April 22, 2023