https://oktelugu.com/

Rangamarthanda Collections : 2 కోట్లు పెట్టి తీశారు.. 3 రోజుల్లో ‘రంగమార్తండా’ రాబట్టిన వసూళ్లు ఇవే!

Rangamarthanda Collections : మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు ఓపెనింగ్స్ ఇవ్వలేకపోవచ్చు కానీ,అద్భుతమైన లాంగ్ ఇస్తారు అనడానికి ఉదాహరణగా నిలిచాయి రీసెంట్ గా విడుదలైన ‘బలగం’ మరియు ‘రంగమార్తాండ’ సినిమాలు.ఈ రెండు చిత్రాలకు ఓపెనింగ్స్ అసలు ఏమి రాలేదు, మంచి సినిమా కావాలంటారు, తీరా తీస్తే ఆదరించరు అంటూ క్రిటిక్స్ తొలుత పెదవి విరిచారు.కానీ ఆ తర్వాత రెండవ రోజు నుండి ఈ రెండు సినిమాలకు వచ్చిన వసూళ్లను చూసి నోరెళ్లబెట్టారు క్రిటిక్స్. మనం మాట్లాడిన మాటలు తప్పు, […]

Written By: , Updated On : March 24, 2023 / 11:25 PM IST
Follow us on

Rangamarthanda Collections : మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు ఓపెనింగ్స్ ఇవ్వలేకపోవచ్చు కానీ,అద్భుతమైన లాంగ్ ఇస్తారు అనడానికి ఉదాహరణగా నిలిచాయి రీసెంట్ గా విడుదలైన ‘బలగం’ మరియు ‘రంగమార్తాండ’ సినిమాలు.ఈ రెండు చిత్రాలకు ఓపెనింగ్స్ అసలు ఏమి రాలేదు, మంచి సినిమా కావాలంటారు, తీరా తీస్తే ఆదరించరు అంటూ క్రిటిక్స్ తొలుత పెదవి విరిచారు.కానీ ఆ తర్వాత రెండవ రోజు నుండి ఈ రెండు సినిమాలకు వచ్చిన వసూళ్లను చూసి నోరెళ్లబెట్టారు క్రిటిక్స్.

మనం మాట్లాడిన మాటలు తప్పు, మంచి సినిమాలను ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు అనే సత్యాన్ని తెలుసుకున్నారు.’బలగం’ చిత్రం ఇప్పటి వరకు పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చూసి 30 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరడానికి సిద్ధంగా ఉంది.ఇప్పుడు ‘రంగమార్తాండ’ అంత రేంజ్ కి చేరుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము కానీ, ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది అని మాత్రం చెప్పగలం.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు జరిగింది.మొదటి రోజు కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా అదే రేంజ్ వసూళ్లు వచ్చాయి.అలా మూడు రోజులకు 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, బ్రేక్ ఈవెన్ కి కోటి రూపాయిల రూపాయిల దూరం లో ఉంది.

ఈ వీకెండ్ లో ఆ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.భారీ బడ్జెట్ సినిమాలకంటే కూడా కంటెంట్ ఉన్న సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని చూసుకుంటారని రీసెంట్ గా విడుదలైన ఈ రెండు సినిమాలతో మేకర్స్ కి అర్థం అయ్యింది.రాబొయ్యే రోజుల్లో ఇలాంటి సినిమాలు కమర్షియల్ చిత్రాలకంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.