RRR Making Video: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి మెచ్చుకున్నారంటే మన రాజమౌళి దర్శకత్వ ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ లోని ఒక్కో సీన్ కోసం రాజమౌళి ఎంత కష్టపడ్డాడు? ఎన్నిరోజులు వెచ్చించాడు అనే విషయం తాజాగా బయటపడింది.
ఆర్ఆర్ఆర్ లోని రాంచరణ్, ఎన్టీఆర్ కలిసే సీన్ కోసం రాజమౌళి కొన్ని నెలల పాటు కసరత్తు చేశాడని తేలింది. ఆసీన్ బాగా రావడానికి డెన్మార్క్ లోని వీఎఫ్ఎక్స్ నిపుణులను భారత్ కు రప్పించి రాజమండ్రి పరిసరాలు చూపించి ఆ ట్రైన్ సీన్ ను డిజైన్ చేయించాడని.. ట్రైన్ బోగీల తయారీకే నెలలు పట్టిందన్న విషయం తాజాగా వెలుగుచూసింది.
Also Read: RRR Creating Records In OTT: OTT లో కూడా ప్రభంజనం సృష్టించిన #RRR.. ఎంత వసూలు చేసిందో తెలుసా..?
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘ట్రైన్ ’ సీన్ లో రాంచరణ్, ఎన్టీఆర్ లు కలిసి నదిలో పడవతో మునిగిపోతున్న బాలుడిని కాపాడుతారు. ఈ సీన్ సినిమాకే హైలెట్. దాన్ని గ్రాఫిక్స్ లో వీఎఫ్ఎక్స్ లో ఎంత కష్టపడి తీశారు? ఎలా గ్రాఫిక్స్ చేశారు? దీనికోసం ఎంత కష్టపడ్డారన్నది తాజాగా వీడియో రూపంలో బయటపెట్టారు.
డెన్మార్క్ కు చెందిన ఓ బృందాన్ని ప్రత్యేకంగా ఈ సీన్ కోసం భారత్ రప్పించి రాజమండ్రి రైల్వే బ్రిడ్స్, దాని చుట్టుపక్కల ఉండే గ్రామీణ వాతావరణాన్ని క్రియేట్ చేయించారు. గోదావరి బ్రిడ్జి ఫొటోలు తీయించి దాని పరిసరాలను గమనించి డెన్మార్క్ బృందం ఈ అద్భుత సీన్ ను నెలల పాటు చేసింది.
Also Read: Caste Politics In Telugu States: ఏపీలో కమ్మ, రెడ్లు.. తెలంగాణలో వెలమ, రెడ్లు.. వేరే నేతలే లేరా?
రాజమౌళి టేకింగ్ ను, కెమెరా పనితనాన్ని వీఎఫ్ఎక్స్ ఇలా టీం మొత్తాన్ని ఈ మేకింగ్ వీడియో చూస్తే మీరూ పొగడకుండా ఉండలేరు. ఆ అద్భుతహా అన్నట్టున్న వీడియోను కింద చూడొచ్చు.