https://oktelugu.com/

Boyfriend : ప్రియురాలితో గొడవ పడి అతడు ఏం చేశాడో తెలుసా?

Boyfriend : తన కోపమే తన శత్రువు అన్నారు. క్షణికావేశంలో మనం చేసేది నూటికి నూరుపాళ్ల తప్పే అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోని వారు జీవితంలో చాలా నష్టపోతారు. ఈ విషయాన్ని ఎన్నో ఉదంతాలు నిరూపించాయి. అయినా మనుషుల్లో కోపం తగ్గడం లేదు. ఫలితంగా ఎంతో నష్టపోతున్నారు. కానీ వారి కోపాన్ని మాత్రం నియంత్రించుకోవడానికి ప్రయత్నించడం లేదు. కోపం మనకు శత్రువులను పెంచుతుంది. అందుకే మిత భాషణమే అలంకార భూషణంగా చెబుతారు. మనలో కలిగే కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే […]

Written By:
  • NARESH
  • , Updated On : January 29, 2023 / 06:56 PM IST
    Follow us on

    Boyfriend : తన కోపమే తన శత్రువు అన్నారు. క్షణికావేశంలో మనం చేసేది నూటికి నూరుపాళ్ల తప్పే అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోని వారు జీవితంలో చాలా నష్టపోతారు. ఈ విషయాన్ని ఎన్నో ఉదంతాలు నిరూపించాయి. అయినా మనుషుల్లో కోపం తగ్గడం లేదు. ఫలితంగా ఎంతో నష్టపోతున్నారు. కానీ వారి కోపాన్ని మాత్రం నియంత్రించుకోవడానికి ప్రయత్నించడం లేదు. కోపం మనకు శత్రువులను పెంచుతుంది. అందుకే మిత భాషణమే అలంకార భూషణంగా చెబుతారు. మనలో కలిగే కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే జీవితంలో అన్ని అనర్థాలే ఏర్పడతాయి. పైగా నష్టాలు కూడా కలుగుతాయి. కోపం సాధ్యమైనంత వరకు మన దరిచేరకుండా చూసుకోవడమే ఉత్తమం.

    ఆగ్రహంపై నిగ్రహం లేకపోతే అంతేసంగతి. కోపంతో మన జీవితంలో ఎన్నో కోల్పోతాం. ఏదైనా ప్రేమతో సాధించిన సంఘటనలు ఉంటాయి కానీ కోపంతో దేన్ని సాధించలేవు. అన్ని కోల్పోతావు. ఇది జీవిత సత్యం. కానీ ఎవరు కూడా దీన్ని లెక్కచేయరు. నిర్లక్ష్యంతోనే కాలం గడుపుతుంటారు. అనవసర విషయాల్లో కూడా కోపం కట్టలు తెంచుకుని ఎదుటి వారిని చంపే వరకు కూడా వెళ్తాయి. ప్రియురాలితో గొడవ పడి ఏకంగా రూ.70 లక్షల విలువ గల కారును దహనం చేయడం సంచలనం కలిగించింది

    తమిళనాడులోని కాంచీపురంలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంబీబీఎస్ చదివే ఓ విద్యార్థికి ప్రియురాలు ఉంది. కవిన్ (28) అనే విద్యార్థి ప్రియురాలితో కలిసి తన బెంజ్ కారులో లాంగ్ డ్రైవ్ వెళ్లాడు. సుదూర ప్రాంతం కావడంతో ఇద్దరు కలిసి మనసు విప్పి ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఓ చోట ఆగి ఇద్దరు ఊసులాడుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో తెలియదు కానీ అతడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన మనసు కంట్రోల్ తప్పింది. ప్రియురాలితో జరిగిన గొడవతో రెచ్చిపోయాడు.