
దేశంలో ఎన్నో సంస్థలు ఇన్సూరెన్స్ సేవలను అందిస్తున్నా ప్రజలు మాత్రం ఎక్కువగా ఎల్‌ఐసీ నే విశ్వసిస్తారు. ఎల్‌ఐసీ బీమా కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఎల్‌ఐసీని ప్రజలు పూర్తిస్థాయిలో నమ్ముతారు. ఎల్‌ఐసీలో చాలా పాలసీలు ఉన్నప్పటికీ కొన్ని పాలసీలు మాత్రం మనకు అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తాయి. ఎల్‌ఐసీలోని మూడు పాలసీలు జీవితకాలం కవరేజీతో పాటు మంచి రాబడిని అందిస్తాయి.
ఈ మూడు పాలసీలు మనం ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, మన కుటుంబానికి భద్రతను కల్పించడంలో సహాయపడతాయి. ఎల్‌ఐసీలో జీవన్ ఉమాంగ్ పాలసీ ఇతర పాలసీలతో పోలిస్తే బెస్ట్ పాలసీ. ఈ పాలసీ ద్వారా ప్రతి నెలా పెన్షన్ పొందడంతో పాటు పాలసీదారుడు మరణిస్తే కుటుంబం బీమా ప్రయోజనాలను పొందుతుంది. 100 సంవత్సరాల వరకు ఈ పాలసీ ద్వారా కవరేజీ లభిస్తుంది.
ఎల్‌ఐసీ అందించే మిగతా పాలసీలలో జీవన్ ఉమాంగ్ తర్వాత న్యూ జీవన్ ఆనంద్ ద్వారా కూడా అదే స్థాయిలో బెనిఫిట్స్ కలుగుతాయి. కనీసం లక్ష రూపాయల మొత్తంతో తీసుకునే ఈ పాలసీ ద్వారా పాలసీదారుడు బీమాతో పాటు బోనస్ పొందవచ్చు. ఒకవేళ పాలసీదారుడు చనిపోతే మాత్రం నామినీ బీమా మొత్తాన్ని పొందవచ్చు.
ఎల్‌ఐసీ పాలసీలలో మరో అత్యుత్తమ పాలసీ ఎల్‌ఐసీ జీవన్ అమర్. పాలసీదారుడు మరణించేంత వరకు ఈ పాలసీ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల కాలపరిమితితో తీసుకునే ఈ పాలసీ ద్వారా 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మూడు పాలసీలలో ఏదో ఒక పాలసీని ఎంచుకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందవచ్చు.