Animal Movie : యానిమల్ మూవీపై విపరీతమైన చర్చ నడుస్తోంది. హింస, శృంగారం, పురుషాధిక్యత, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు వంటి చెడును ప్రోత్సహించేదిగా చిత్రం ఉందని పలువురు అభిప్రాయ పడ్డారు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న యానిమల్ కలెక్షన్స్ వర్షం కురిపించింది. మూడో వారంలో కూడా యానిమల్ వసూళ్లు కొనసాగుతున్నాయి. యానిమల్ రూ. 772 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. నెగిటివ్ పబ్లిసిటీ ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది.
పార్లమెంట్ వేదికగా యానిమల్ సినిమాను వ్యతిరేకిస్తుండగా… నటుడు బాబీ డియోల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ రోల్ చేశారు. పెళ్లి వేడుకలో భార్య మీద బాబీ డియోల్ అత్యాచారం చేస్తాడు. మిగతా ఇద్దరు భార్యలను కూడా రేప్ చేయబోతాడు. ఈ సన్నివేశం విమర్శలకు గురైంది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ… యానిమల్ మూవీ ఆ రేప్ సీన్ కారణంగానే అంత పెద్ద విజయం సాధించింది. తక్కువ నిడివితో కూడిన విలన్ పాత్ర క్రూరత్వం గురించి చెప్పేందుకు ఆ సీన్ రూపొందించారు.
ఇలాంటి విషయాలు నేను ప్రోత్సహించను. కానీ విలన్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు తెలియాలని ఆ సీన్ పెట్టడం జరిగింది, అన్నారు. ఆ రేప్ సీన్ లేకపోతే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదని బాబీ డియోల్ చెప్పడం చర్చకు దారి తీసింది. జనాలు బాబీ డియోల్ ని మర్చిపోయారు. చాలా కాలం తర్వాత ఆయన యానిమల్ మూవీతో వెలుగులోకి వచ్చాడు. బయట ఆయనకు దక్కుతున్న గౌరవం చూసి కన్నీరు పెట్టుకున్నారు.
యానిమల్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. ఆయన మూడో చిత్రం ఇది. యానిమల్ చిత్రానికి సందీప్ రెడ్డి నిర్మాణ భాగస్వామి కూడాను. రన్బీర్ కపూర్ కి జంటగా రష్మిక మందాన నటించింది. అనిల్ కపూర్ కీలక రోల్ చేశారు. యానిమల్ రన్బీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నమోదైంది. ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయం అంటున్నారు. 2023 హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా యానిమల్ నిలిచింది.
It’s just Abrar’s entry Jamal Kudu everywhere across the platforms https://t.co/SxfOIUMjTL#AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep
— Bobby Deol (@thedeol) December 9, 2023