SS Rajamouli: రాజమౌళి కెరీర్లో ఆ మూవీ ఓ అట్టర్ ప్లాప్!

SS Rajamouli: రాజమౌళి అపజయమెరుగని దర్శకుడు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఒకరు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో ఆయన ఫేమ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతుంది. గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ భారతీయులు గర్వపడేలా చేసింది. ఆస్కార్ నామినేషన్లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సంచలనం నమోదు చేయాలని అందరూ ఎదురుచూస్తున్నారు. […]

Written By: Shiva, Updated On : February 8, 2023 11:28 am
Follow us on

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి అపజయమెరుగని దర్శకుడు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఒకరు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో ఆయన ఫేమ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతుంది. గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ భారతీయులు గర్వపడేలా చేసింది. ఆస్కార్ నామినేషన్లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సంచలనం నమోదు చేయాలని అందరూ ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వంటి సినిమా మేధావులు కొనియాడారు.

అపజయమెరుగని రాజమౌళి కెరీర్లో కూడా ప్లాప్స్ ఉన్నాయి. అయితే దర్శకుడిగా కాదు నటుడిగా. రాజమౌళికి నటన పట్ల కూడా చాలా మక్కువ ఉంది. తన కోరికను చిన్న చిన్న క్యామియో రోల్స్ ద్వారా తీర్చుకుంటూ ఉంటాడు. తన దర్శకత్వంలో అలాగే ఇతర దర్శకుల సినిమాల్లో ఆయన నటించారు. అసలు దర్శకుడు కాకముందు ఆయన నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. 1993లో పిల్లనగ్రోవి టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కింది. ఆ చిత్రంలో రాజమౌళి కృష్ణుడు పాత్ర చేశాడు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు.

2004లో రాజమౌళి తన మూడవ చిత్రంగా సై తెరకెక్కించారు. ఈ మూవీలో నల్లబాలు అనే కామెడీ రోల్ చేశారు వేణుమాధవ్. నల్లబాలు అసిస్టెంట్ గా చిన్న పాత్రలో మెరిశారు. అనంతరం రైన్ బో మూవీలో రాజమౌళి క్యామియో రోల్ చేశారు. వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన రైన్ బో మూవీలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ హీరోగా నటించారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్. ఈ మూవీ ప్లాప్ అయ్యింది. నటుడిగా రాజమౌళి కెరీర్లో రైన్ బో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ విధంగా రాజమౌళికి కూడా ఓ ప్లాప్ ఉందన్నమాట.

SS Rajamouli:

తర్వాత మగధీర, బాహుబలి, మజ్ను చిత్రాల్లో కూడా రాజమౌళి చిన్న చిన్న పాత్రలు చేశారు. నిజానికి ప్రతి దర్శకుడితో నటుడు కూడా ఉంటారు. తాము రాసే పాత్రల్లో, సన్నివేశాల్లో నటులు ఎలా చేయాలనే ఊహలు వాళ్ళ మదిలో మెదులుతాయి. తన సినిమాల్లో ప్రతి సన్నివేశాన్ని రాజమౌళి స్వయంగా నటించి చూపిస్తారు. దాని వలన తమ పని ఈజీ అవుతుంది పలువురు నటులు చెప్పడం జరిగింది. రాజమౌళి ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఆ కోరిక నెరవేరే ఆస్కారం లేకపోలేదు.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఈ ఏడాదే మహేష్-రాజమౌళి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

 

Tags