Venkatesh: వెంకటేశ్ వల్ల ఆ హీరోయిన్ కు చెడ్డపేరు వస్తుందని రామనాయుడు అంతపనిచేశాడా?

Venkatesh: తెలుగు సినీ ఇండస్ట్రీలో వెంకటేశ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తన యాక్షన్ తో కన్నీళ్లు తెప్పించే హీరో ఎవరంటే విక్టరీ అని మాత్రమే చెప్పొచ్చు. ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ తన సీనీ కెరీర్లో ఎందరో భామలతో సినిమాలు తీశారు. కానీ ఇప్పటికీ ఆయనతో నటించిన వారిలో కొందరు ఇండస్ట్రీలో కొనసాగుతుండగా.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని సెటిలైపోయారు. అయతే 1990 కాలంలో వెంకటేశ్, ఓ హీరోయిన్ కాంబినేషన్లో […]

Written By: Chiranjeevi Appeesa, Updated On : March 8, 2023 12:55 pm
Follow us on

Venkatesh

Venkatesh: తెలుగు సినీ ఇండస్ట్రీలో వెంకటేశ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తన యాక్షన్ తో కన్నీళ్లు తెప్పించే హీరో ఎవరంటే విక్టరీ అని మాత్రమే చెప్పొచ్చు. ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ తన సీనీ కెరీర్లో ఎందరో భామలతో సినిమాలు తీశారు. కానీ ఇప్పటికీ ఆయనతో నటించిన వారిలో కొందరు ఇండస్ట్రీలో కొనసాగుతుండగా.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని సెటిలైపోయారు. అయతే 1990 కాలంలో వెంకటేశ్, ఓ హీరోయిన్ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని రూమర్స్ క్రీయేట్ అయ్యాయి. ఈ విషయం రామానాయుడు వద్దకు చేరింది. దీంతో ఆయన వీటికి చెక్ పెట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

రామానాయుడికి ఉన్న ఇద్దరు కుమారుల్లో ఒకరు సురేశ్ బాబు. ఈయన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కుమారుడు రానా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు. రామానాయుడు మరో కుమారుడు వెంకటేశ్. విక్టరీగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’ చిత్రం ద్వారా ఫిల్మ్ నగర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కొంతకాలం ఆయనను పట్టించుకోకపోయినా తరువాత కాలంలో స్టార్ హీరోగా మారిపోయాడు.దీంతో ఆయనతో చాలా మంది హీరోయిన్లు నటించారు. వీరిలో మిగతా వారి కంటే సౌందర్య ఎక్కువ సినిమాలు చేశారు.

ఇలా 1990ల కాలంలో వెంకటేశ్, సౌందర్య ల మధ్య ఎన్నో సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు.. పెళ్లి చేసుకుందాం రా.. రాజా, జయం మనదేరా.. దేవి పుత్రుడు లాంటి సినిమాలు వచ్చాయి. దాదాపు అన్నీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో పుకార్లు లేచాయి. ఒక దశలో వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందని కొందరు ప్రచారం చేశారు.

Venkatesh

అయితే ఈ విషయం రామానాయుడికి తెలియగానే కొంతకాలం వీరి మధ్య సినిమాలు వద్దని అన్నారట. వీరి మధ్య వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాలని అనుకున్నారట. కానీ కొందరు దర్శకులు అవేమీ పట్టించుకోకుండా మళ్లీ సినిమాలు తీశారట. అయితే సౌందర్య వెంకటేశ్ తోనే కాకుండా ఇతర హీరోలతోనూ చాలా సినిమాలు తీశారు. చివరి వరకు హీరోయిన్ గానే ఉన్న ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఇప్పటికీ అందరినీ కలిచివేస్తుంది.

 

Tags