SS Thaman Remuneration: జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు సినిమాలకు పంట పండింది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అల..వైకుంఠపురం’ సినిమాకు ఏదో ఒక అవార్డు వస్తుందని ఫ్యాన్స్ ఊహించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా మ్యూజిక్ కేటగిరీలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కు ఈ అవకాశం వచ్చింది. ఈ సినిమాలో థమన్ అందించిన మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. సినిమా రిలీజ్ కాకముందే పాటలు బాగా హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనకు జాతీయ అవార్డు లభించిందని సినీ ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అయితే ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించిన థమన్ కు ఇప్పుడు జాతీయ అవార్డు రావడంతో ఆయన రేంజ్ పెరిగిందని అంటున్నారు. అంతేకాకుండా ఆయన రెమ్యూనరేషన్ పై కూడా జోరుగా చర్చ సాగుతోంది.
సౌత్ ఇండస్ట్రీలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లయిన ఏఆర్ రహమాన్, మణిశర్మ, కోటీ ల వద్ద థమన్ శిక్షణ పొందాడు. ఏన్నో ఏళ్లుగా వీళ్ల వద్ద అసిస్టెంట్ గా ఉంటూ సంగీత మెళకువలు నేర్చుకున్నాడు. కీబోర్డు ప్లేయర్ గా, డ్రమ్ వాయిస్తూ రాణించాడు. అయితే శిక్షణ పూర్తి చేసుకున్న థమన్ కు మొదట్లో అవకాశాలు రాలేదు. దీంతో ఆయన నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటిసారి థమన్ ‘బాయ్స్’ సినిమాలో కనిపించాడు. హీరో స్నేహితుల్లో థమన్ ఒకరిగా మెరుస్తాడు. అయితే సినిమాల్లో నటుడిగా కూడా రాణించకపోవడంతో మళ్లీ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయత్నించాడు.
Also Read: The Warrior Collections: ‘ది వారియర్’ 11 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
ఈ తరుణంలో ఆయనకు తెలుగు డైరెక్టర్ సురేందర్ రెడ్డి అవకాశం ఇచ్చాడు. రవితేజ సహకారంతో థమన్ మొదటిసారిగా ‘కిక్’ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా కథ పరంగా హిట్టు కావడంతో పాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. దీంతో థమన్ కు అవకాశాలు పెరిగాయి. ఆ తరువాత అగ్రహీరోల సినిమాలకు మ్యూజిక్ అందించారు. రీసెంట్లీగా వచ్చిన బాలకృష్ణ సినిమా అఖండ సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ కు సౌండ్ సిస్టమ్ కూడా కారణమని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగింది.
ఇప్పుడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చరణ్ 15వ సినిమాకు, మహేశ్ బాబు 28వ సినిమాకు మ్యూజిక్ అందించున్నాడు. అయితే ఇప్పటి వరకు థమన్ సినిమాను భట్టి రెమ్యూనరేషన్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. కంటెంట్ బాగుంటే కోటి రూపాయల వరకు తీసుకున్నాడని అంటున్నారు. చివరి సినిమాకు ఆయన రూ.2 కోట్లు తీసుకున్నాడని చర్చ సాగుతోంది. అయితే ఇప్పుడు జాతీయ అవార్డు దక్కించుకున్న థమన్ నెక్ట్స్ సినిమాకు రూ.2 కోట్లకుపైగానే రెమ్యూనరేషన్ పెంచుతాడని అంటున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా థమన్ మ్యూజిక్ కు అగ్ర హీరోలు సైతం ఫిదా అవుతున్నారు. మొన్నటి వరకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే ఇష్టపడిన వాళ్లు ఇప్పుడు థమన్ కోసం వెయిట్ చేస్తున్నారు. గురువులకు తగ్గ శిష్యుడని పేరు తెచ్చుకుంటున్న థమన్ జాతీయ అవార్డు సాధించడంపై పలువురు అభినందిస్తున్నారు. అంతేకాకుండా ఫ్యూచర్లో మరెన్నో పెద్ద్ సినిమాలకు థమన్ మ్యూజిక్ అందిస్తాడని ఆయన ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Also Read:Rashmika Mandanna: ఫుడ్ డెలివరీ గర్ల్ గా మారిపోయిన ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక