https://oktelugu.com/

Thalapathy Vijay Vaarasudu Official Trailer : పవర్ సీటులో ఉండదు, అందులో కుర్చున్నోడిలో ఉంటుంది.. విజయ్ విరగ్గొట్టేశాడుగా!

Thalapathy Vijay Vaarasudu Official Trailer Talk : విజయ్ నటించిన వారసుడు 2023 సంక్రాంతి చిత్రాల్లో ఒకటి. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు పట్టుబట్టి బరిలో దించాడు. సంక్రాంతి సింహాలు చిరంజీవి, బాలయ్యలతో పోరు అంత ఈజీ కాదు. కంటెంట్ పై నమ్మకంతో ఆయన ఈ సాహసం చేశారు అనిపిస్తుంది. వారసుడు ట్రైలర్ చూశాకా మూవీ విజయంపై నమ్మకం పెరిగింది. నేడు విడుదలైన వారసుడు ట్రైలర్ ఆకట్టుకుంది. యాక్షన్, లవ్, కామెడీ కలగలిపిన పక్కా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2023 / 08:16 PM IST
    Follow us on

    Thalapathy Vijay Vaarasudu Official Trailer Talk : విజయ్ నటించిన వారసుడు 2023 సంక్రాంతి చిత్రాల్లో ఒకటి. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు పట్టుబట్టి బరిలో దించాడు. సంక్రాంతి సింహాలు చిరంజీవి, బాలయ్యలతో పోరు అంత ఈజీ కాదు. కంటెంట్ పై నమ్మకంతో ఆయన ఈ సాహసం చేశారు అనిపిస్తుంది. వారసుడు ట్రైలర్ చూశాకా మూవీ విజయంపై నమ్మకం పెరిగింది. నేడు విడుదలైన వారసుడు ట్రైలర్ ఆకట్టుకుంది. యాక్షన్, లవ్, కామెడీ కలగలిపిన పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వారసుడు చిత్రం తెరకెక్కింది. ట్రైలర్ లో వారసుడు సినిమా కథ మొత్తం చెప్పేశారు.

    శరత్ కుమార్-జయసుధలకు శ్రీకాంత్, కిక్ శ్యామ్, విజయ్ ముగ్గురు కుమారులు. అందమైన ఈ ఉమ్మడి కుటుంబంలో చిన్న కొడుకు విజయ్ అల్లరి పిడుగు. ఇద్దరు కొడుకులు తండ్రితో పాటు వ్యాపారాలను చూసుకుంటూ ఉంటారు. ఆ అందమైన కుటుంబాన్ని ప్రకాష్ రాజ్ డిస్ట్రబ్ చేస్తాడు. వ్యాపార ఆధిపత్యం కోసం… చిన్నాభిన్నం చేస్తాడు. అప్పుడు రంగంలోకి దిగిన వారసుడు విజయ్… ప్రకాష్ రాజ్ ని ఎలా ఎదుర్కొన్నాడు, అనేది కథ.

    శ్రీమంతుడు, అల వైకుంఠపురంలో తో పాటు చాలా సినిమాల పోలికలు వారసుడుట్రైలర్ లో కనిపించాయి. మహేష్ ఈ కథను రిజెక్ట్ చేయడానికి ఇదే రీజన్ కావచ్చు . వారసుడు కథ పాతదే అనిపిస్తుంది. వంశీ పైడిపల్లి టేకింగ్, స్క్రీన్ ప్లే, విజయ్ స్టార్డమ్ సినిమాను విజయ తీరాలకు చేర్చాల్సి ఉంది. రష్మిక మందానకు కథలో పెద్ద స్కోప్ ఉన్నట్లు లేదు. ఆమె సినిమాకు జస్ట్ గ్లామర్ డాల్ మాత్రమే. ట్రైలర్ లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ పాళ్ళు అధికంగానే మిక్స్ చేశారు. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. దిల్ రాజు కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారని అర్థం అవుతుంది.

    ఇక ట్రైలర్ లో కూడా విడుదల తేదీ ప్రకటించకపోవడం కొసమెరుపు. అయితే జనవరి 12న విడుదల చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వారసుడు చిత్రం కోసం పెద్ద ఎత్తున థియేటర్స్ కేటాయించారు. వైజాగ్ లో వారసుడు 8 స్క్రీన్స్ లో విడుదల అవుతుంటే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు చెరో 5 స్క్రీన్స్ దక్కాయి. ఏది ఏమైనా సంక్రాంతి పోరు రసవత్తరంగా మారింది. వారసుడు మూవీతో విజయ్… చిరంజీవి, బాలయ్యలకు గట్టిపోటీ ఇస్తాడు అనిపిస్తుంది.