Thailand: వాలంటైన్ డే ప్రేమికుల దినోత్సవం. ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమికుల దినోత్సవం రోజు ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. ప్రేమికుల మధ్య ఎన్నో ఊసులు, బాసలు చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రేమికులకు ఆ రోజు పండగే. తమ ప్రేమను వ్యక్తం చేస్తూ అభిప్రాయాలు పంచుకుంటారు. అప్పటికే ప్రేమలో ఉన్న వారు తాము కోరుకున్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అవాంఛిత గర్భం వచ్చే అవకాశాలున్నాయి. దీంతో వారి జాగ్రత్త కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు.

థాయ్ లాండ్ లో విచ్చలవిడి శృంగారం ఉంటుంది. హద్దులు ఉండవు. ఫలితంగా యువత అవాంఛిత గర్భం తెచ్చుకుంటున్నారు. పెళ్లి కాక ముందే తల్లులు అవుతున్నారు. వారి భవిష్యత్ అంధకారంగా మిగులుతోంది. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం వారికి ఉచితంగా కండోమ్ అు అందించేందుకు సిద్ధపడుతోంది. ప్రేమికుల రోజు వారికి ఒక్కొక్కరికి పది కండోమ్ లు అందించేందుకు చర్యలు చేపట్టింది. శృంగారం విషయంలో తప్పు చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది.
స్మార్ట్ ఫోన్ ద్వారా పేరు నమోదు చేసుకుని సమీపంలోని మందుల దుకాణంలో లేదా ప్రభుత్వ ఫార్మసీని ఎంచుకోవాలి. రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత వారికి ఉచిత కండోమ్ లు అందుబాటులో ఉంచుతారు. స్మార్ట్ ఫోన్లు వాడనివారు సమీపంలోని కేంద్రాలకు వెళ్లి థాయ్ లాండ్ ఐడీ కార్డు ప్రదర్శిస్తే ఉచితంగా కండోమ్ లు పొందవచ్చు. నాలుగు సైజుల కండోమ్ లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. అనురక్షిత శృంగారాన్ని నిరోధించి ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది.

థాయ్ లాండ్ లో ప్రతి సంవత్సరం వాలంటైన్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి నెలంతా ప్రేమికుల దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు జాగ్రత్తలు తీసుకోవాలనే హెచ్ ఐవీ వంటి రోగాల నుంచి దూరంగా ఉండేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే టీనేజ్ లో ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలని భావిస్తోంది. వీటి బారి నుంచి రక్షించుకోవాలని యువతకు కండోమ్ లు అందజేస్తోంది. ప్రజల్లో చైతన్యం కలిగించి వారి రక్షణకు ముమ్మరంగా చర్యలు చేపడుతోంది.
ప్రేమికుల రోజు ఎందరో జంటలు ఏవో పనులు చేసేందుకు రెడీగా ఉంటారు. అలాంటి వారి సంక్షేమం కోసం కండోమ్ లు సరఫరా చేస్తోంది. ఈ మేరకు కండోమ్ లు అందజేసి వారిని ఇతర రోగాల బారిన పడకుండా ప్రణాళికలు రచిస్తోంది. సురక్షితమైన శృంగారంతోనే ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి. దీనికి గాను ప్రభుత్వమే ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. యువత చెడు దారుల్లో ప్రయాణించి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలుకుతోంది.