Tesla: టెస్లా బంపర్ జాబ్ ఆఫర్.. రోజుకు రూ.28 వేలు.. అర్హతలు ఇవీ..

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల సంక్షేభం కొనసాగుతోంది. కొత్త నోటిఫికేషన్లు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకూ గ్యారంటీ లేకుండా పోయింది. దీంతో నిరుద్యోగ రేటు పెరుగుతోంది. మరోవైపు ఉద్యోగాలు కోల్పోతున్న వారూ పెరుగుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 22, 2024 8:33 am

Tesla

Follow us on

Tesla: ప్రపంచ వ్యాప్తంగా బడా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఆర్థిక మాంద్యం కారణంగా చాలావరకు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్‌, విప్రో లాంటి ఐటీ కంపెనీలతోపాటు అమెజాన్‌ వంటి ఈకామర్స్‌ సంస్థలు కూడా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. ఈ తరుణంలో ఇటీవల కాగ్నిజెంట్‌.. వార్షిక వేతన రూ.2 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ట్రోల్‌ చేశారు. అయితే తర్వాత కాగ్నిజెంట్‌ వివరణ ఇచ్చింది. ఇక తాజాగా బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా వినూత్న ఉద్యోగావశాన్ని ప్రకటించింది. రోజుకు ఏడు గంటలు నడవగలిగే సామర్థ్యంతోపాటు టెక్నాలజీ వాడకంపై అవగాహన అర్హతగా ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్‌ ఇచ్చింది. ఈ ఉద్యోగం కోసం గంటకు 48 డాలర్లు (సుమారు రూ.4 వేలు) అందిస్తామని ప్రకటించింది. టెస్లా తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ అభివృద్ధిలో భాగమైన ఆఫర్, మోషన్-క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి రోబోట్‌కు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అవకాశం ద్వారా ప్రజలు రోజుకు రూ.28,000 వరకు సంపాదించవచ్చు.

ఆప్టిమస్‌ కాన్సెప్ట్‌..
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 2021లో ఆప్టిమస్ అనే కాన్సెప్ట్‌ను మొదటిసారిగా పరిచయం చేశాడు. దీనిని ఫ్యాక్టరీ పని నుంచి సంరక్షణ వరకు నిర్వహించే సామర్ధ్యం కలిగిన మల్టీ-ఫంక్షనల్ రోబోగా ఊహించారు. గత సంవత్సరంలో.. టెస్లా తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. మోషన్-క్యాప్చర్ సూట్‌ల ద్వారా ఆప్టిమస్‌కి శిక్షణ ఇవ్వడంలో సహాయం చేయడానికి అనేక మంది కార్మికులను నియమించుకుంది. ‘డేటా కలెక్షన్ ఆపరేటర్’ పేరుతో ఉన్న ఈ ఉద్యోగంలో మోషన్-క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ధరించి రోజూ ఏడు గంటల కంటే ఎక్కువ సమయం పరీక్ష మార్గాల్లో నడవడం ఉంటుంది. ఈ జాబ్‌కు డేటా సేకరణ, విశ్లేషణ, నివేదిక రాయడం, చిన్న పరికరాలకు సంబంధించిన పనులు చేయాలి.

అర్హతలు ఇవీ..
ముఖ్యంగా.. ఎత్తు 5.7 నుంచి 5.11 అడుగుల మధ్య ఉండాలి. 13 కిలోల బరువు మోయగలిగే సామర్థ్యం ఉండాలి. వేతనం గంటకు 25.25 డాలర్ల నుంచి 48 డాలర్ల మధ్య ఉంటుంది. అనుభవం, నైపుణ్యం సహా నిర్వర్తించబోయే విధులను అనుసరించి ప్యాకేజీ మారుతుంది. మెడికల్‌, డెంటల్‌, విజన్‌ బీమా, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలతో పాటు ఇతర ప్రోత్సాహకాలూ ఉంటాయి. ఉద్యోగంలో వివిధ షిఫ్టులు కూడా ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు లేదా సాయంత్రం 4 నుంచి రాత్రి 12:30 గంటల వరకు లేదా రాత్రి 12 నుంచి ఉదయం 8:30 గంటల వరకు షిఫ్టులు ఉంటాయి. మీరు టెస్లా కెరీర్ పేజీలో అన్ని వివరాలను తనిఖీ చేయవచ్చు. ఈ ఉద్యోగం పాలో ఆల్టో, కాలిఫోర్నియాలో ఉంటుంది.