Homeట్రెండింగ్ న్యూస్Psycho Lover: శ్రద్ధను చంపి..35 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో పెట్టి.. అక్కడే...

Psycho Lover: శ్రద్ధను చంపి..35 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో పెట్టి.. అక్కడే మరో అమ్మాయితో శృంగారం

Psycho Lover: హాలీవుడ్ లో “రాంగ్ టర్న్” అని ఒక సినిమా ఉంది. కొందరు నరరూప రాక్షసులు మనుషుల్ని చంపి తింటారు. ఆ సన్నివేశాలు చూసేందుకు చాలా భయానకంగా ఉంటాయి. ఈ సినిమా చూసి ఘనా దేశం లో మెన్ మీట్ పేరిట ఒక హోటల్ వెలిసింది. అక్కడ ఏం వడ్డిస్తారో మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటా? ఈ విషయం కొద్దిరోజుల తర్వాత పోలీసులకు తెలిసింది. వారు ఆరా తీస్తే హోటల్ నిర్వాహకులు రాత్రిపూట రోడ్లపై పడుకునే అనాధలను హత్య చేసి వారి మాంసంతో వంటకాలు తయారుచేస్తున్నారని తెలిసింది. మనుషుల మాంసంతో చేసిన వంటకాలను మిగతా వారు లొట్టలు వేసుకుంటూ తినడం గమనార్హం. పోలీసులు విచారిస్తే తాము రాంగ్ టర్న్ సినిమా చూసి ఈ హోటల్ పెట్టినట్టు ఒప్పుకోవడం గమనార్హం. అంటే సినిమా ప్రభావం మనుషుల పై ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నమ్మి వచ్చిన ప్రేయసిని ముక్కలు ముక్కలుగా నరికిన అప్తాబ్ ఉదంతం లో డెక్స్ టర్ అనే అమెరికన్ క్రైమ్ వెబ్ సీరిస్ కీలక పాత్ర పోషించింది. ఈ సీరీస్ లో తన ప్రేయసిని ఓ సైకో చంపి, ముక్కలు చేసిన విధానం ఒళ్ళు గగురుపొడుస్తుంది. దీనిని చూసి ప్రేరణ పొంది అప్తాబ్ తన ప్రేయసిని చంపాడు. ఏ మాత్రం కనికరం లేకుండా 35 ముక్కలు చేసాడు. వాటిని ఒక ఫ్రిజ్లో దాచిపెట్టాడు.. వాసన రాకుండా అగరుబత్తులు వెలిగించాడు.. పైగా మరో అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్ పక్కనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. చదువుతుంటే ఒళ్ళు గగురపొడుస్తుంది కదూ! ఇక వాడిని విచారిస్తున్న పోలీసులకు ఏ స్థాయిలో మైండ్ బ్లాంక్ అయి ఉంటుందో?

Psycho Lover
Psycho Lover

బాధ్యత లేదా?

ఎవరిది తప్పు? ఎవరిది బాధ్యతా రాహిత్యం? శ్రద్ధ వాకర్ కేసులో ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు ఇవి. కాల్ సెంటర్ లో పని చేసే శ్రద్ద అప్తాబ్ మాయలో పడింది. అప్పటికే ఇద్దరు శారీరక సుఖాన్ని అనుభవించారు. అతడే సర్వస్వం అనుకున్న శ్రద్ద ఇంట్లో నుంచి అతడితో వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి వాడి అసలు రూపం ఆమెకు కనిపించింది. నరకం చూపేవాడు. ఫోన్ మాట్లాడనిచ్చే వాడు కాదు. అమ్మానాన్నలు, తో బట్టువు ఇలా అందరినీ దూరం చేశాడు. శ్రద్ధ తో ఉంటూనే ఇంకో అమ్మాయి తో డేటింగ్ మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకో అన్నందుకు శ్రద్ధను హింసించి మరీ చంపాడు.

డెక్స్ టర్ స్పూర్తితో

డెక్స్ టర్ అనే క్రైమ్ సిరీస్ స్పూర్తి తో శ్రద్ద శరీరాన్ని రంపాలతో ముక్కలు చేసి ఒక్కో అవయవాన్ని ఒక్కో చోట పడేశాడు. అంతకుముందు ఆ అవయవాల ను ప్రిడ్జ్ లో దాచాడు. వాసన రాకుండా అగరు బత్తులు వెలిగించే వాడు. పైగా ఎవరికీ అనుమానం రాకుండా శ్రద్ద సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ లు పెట్టేవాడు. పైగా డేటింగ్ యాప్ లో పరిచయమైన ఒక అమ్మాయిని అదే ప్లాట్ కు తీసుకొచ్చాడు. శ్రద్ధ శరీర భాగాలు పెట్టిన ఫ్రిజ్ పక్కనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. శ్రద్ధ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె స్నేహితుడికి అనుమానం రావడం, ఈ విషయం ఆమె తండ్రికి చెప్పడం, అతడు పోలీసులను ఆశ్రయించడంతో వాడి దుర్మార్గం బయట పడింది. ఇంత జరిగినా వాడు జైల్లో హాయిగా, ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా కునుకు తీస్తున్నాడు.

Psycho Lover
Psycho Lover

సెన్సార్ ఏది?

కొవిడ్ వల్ల ఓటీటీ లు మన నట్టింట్లోకి వచ్చాయి. అవి వీక్షకులను ఆకట్టుకునేందుకు వెబ్ సీరిస్ లు నిర్మిస్తున్నాయి. వీటిల్లో క్రైమ్ పాళ్లు ఎక్కువ. ఒక్కోసారి అది శృతి మించుతోంది. హింస, హత్యలు, ఆ తరహా సన్ని వేషాలు హద్దు దాటుతున్నా యి. అప్తాబ్ శ్రద్ధను చంపేందుకు డెక్స్ టర్ అనే అమెరికన్ వెబ్ సీరిస్ ను ప్రేరణ గా తీసుకున్నానని చెప్పడం మనిషి పై సినిమా ఎంత ప్రభావం చూపిస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇక ఓటీటీ ల్లో స్ట్రీమింగ్ అవుతున్న వాటిల్లో సెన్సార్ కట్స్ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తీస్తున్నారు. వీక్షకులు కూడా వాటినే ఇష్ట పడుతున్నారు. అమెజాన్, డిస్నీ, నెట్ ప్లిక్స్, ఆహా, సోనీ లీవ్, అల్ట్ బాలాజీ.. ఇలా ఏ ఓటీటీ చూసినా అందులో క్రైమ్ సిరీస్ లే మోస్ట్ వ్యూయర్ షిప్ లో ఉంటాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే గానీ ఇందులో మార్పు రాదు. అప్పటి వరకు ఎంతో మంది శ్రద్ద లు కన్ను మూస్తూనే ఉంటారు. అప్తాబ్ లు చెంపేస్తూనే ఉంటారు. అన్నట్టు ఇంత జరిగినా అప్తాబ్ తల్లిదండ్రులు కొడుకుని కాపాడుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నారు. అంటే పిల్లల్ని పక్క దారి పట్టించడం లో తల్లిదండ్రులది కీలక పాత్రే అని రూడీ అవుతున్నది. అన్నట్టు ఈ కేసులో మతం మార్పిడి అనే కోణం కూడా ఉందట! పోలీసులు ఇంకా తవ్వితే గానీ మిగతా నిజాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular