Unique Blood Group: మానవ శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. దాన్ని ప్రతి గంటకోసారి కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. దీంతో రక్తం శరీర భాగాలన్నింటికి సరఫరా అవుతుంది. లేకపోతే మన జీవనక్రియ నడవదు. అలాంటి రక్తంలో ఏ,బీ, ఏబీ, ఓ అనే గ్రూపులుంటాయని తెలిసిందే. కానీ అరుదైన ఇంకో రకం గ్రూపు కూడా ఉంటుందనేది ఎవరికి తెలియని నిజం. వాస్తవంగా ఈ గ్రూపులే ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రపంచంలోనే అతి కొద్ది మందిలో ఉండే బ్లడ్ గ్రూపు కూడా ఒకటి ఉంది. దాని పేరు ఈఎంఎం నెగెటివ్ గ్రూపు. ఇది ప్రపంచంలోనే పదిమందిలో ఉంటుందట. అందుకే ఈ గ్రూపు గురించి ఎవరికి తెలియదు.

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో ఓ 65 ఏళ్ల వ్యక్తిలో ఈఎంఎం నెగెటివ్ గ్రూపు రక్తం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో అతడి రక్తం ఎవరికి ఇవ్వరాదు. ఎవరి రక్తం అతడు తీసుకోరాదు. ఈ బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే పది మందిలో మాత్రమే ఉంటుందట. దీంతో ప్రపంచంలోనే ఈ బ్లడ్ గ్రూపు ఉన్న పదో వ్యక్తిగా ఇతడు రికార్డు సృష్టించాడు. సాధారణంగా రక్తంలో ఏ,బీ, ఓ, హెచ్ ఆర్ వంటి 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. కానీ ఈఎంఎం లో 375 రకాల యాంటిజెన్లు ఉంటాయి. ఇదే ప్రత్యేకత. దీంతో ఈ గ్రూపు వారు ప్రపంచంలోనే అరుదుగా ఉండటం గమనార్హం.
Also Read: Visakhapatnam- CM Jagan: జగన్ బిచాణా ఎత్తేస్తున్నాడా? పాలన ఇక అక్కడ నుంచే?
ఇతడికి గుండె సంబంధ వ్యాధి ఉండటంతో శస్త్ర చికిత్స కోసం రక్తాన్ని పరీక్ష చేయగా ఈఎంఎం నెగెటివ్ అని తేలింది. మొదట రక్తాన్ని పరీక్షించినా బ్లడ్ గ్రూపు తేలకపోవడంతో అహ్మదాబాద్ కు పంపారు. తరువాత సూరత్ పంపినా తేలకపోవడంతో అతడి కుటుంబ సభ్యుల రక్తాన్ని సేకరించి అమెరికాకు పంపించగా వారు నిర్ధారణ చేశారు. దీంతో అక్కడ పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈఎంఎం బ్లడ్ గ్రూపు గల వ్యక్తులు ప్రపంచంలో పది మంది ఉంటారు. మన దేశంలో ఇతడు ఉండటంతో ఇతడిని కూడా అరుదైన వ్యక్తిగానే గుర్తించారు.

ప్రపంచంలోని కొద్ది మందిలో ఉండే రక్త నమూనా ఈఎంఎం నెగెటివ్ గ్రూపు కలిగి ఉండటం సంచలనమే. ఇతడు తన రక్తాన్ని వేరే వారికి ఇవ్వరాదు. వేరే వారి రక్తాన్ని ఇతడు తీసుకోరాదు. దీంతో ప్రస్తుతం ఇతడి గుండె ఆపరేషన్ గురించి వైద్యులు ఏం చేస్తారో తెలియడం లేదు. ఈఎంఎం నెగెటివ్ గ్రూప్ అని తెలియడంతో అందరు అవాక్కయ్యారు. ప్రపంచంలోనే పది మందిలో ఉండే గ్రూపు కావడంతో ఏం చేయాలో కూడా వైద్యులకు అర్థం కావడం లేదు. మొత్తానికి అతడి గుండె శస్త్ర చికిత్స మాత్రం వాయిదా పడిందని తెలుస్తోంది.