Reshma Pasupuleti: 2017లో సుచీ లీక్స్ కోలీవుడ్ ని కుదిపేశాయి. ధనుష్, అనిరుధ్, రానా, త్రిష, ఆండ్రియాతో పాటు పలువురి రాసలీల ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. సింగర్ సుచిత్ర పరిశ్రమపై కోపంతో పెద్దోళ్ల చీకటి బ్రతుకులు బహిర్గతం చేసింది. సుచీ లీక్స్ దెబ్బకు ప్రముఖులు గజగజ వణికిపోయారు. ఎక్కడ తమ బండారం కూడా బయటపడుతుందో అని కంగారు పడ్డారు. సుచిత్ర వద్ద ఇంకెవరెవరి ప్రైవేట్ ఫోటోలు ఉన్నాయో అని చెమటలు పట్టాయి. ధనుష్, అనిరుధ్ తనకు మద్యం తాగించి మత్తులో లైంగికంగా వాడుకున్నారని సుచిత్ర ఆరోపించడం జరిగింది. సింగర్ చిన్మయిపై కూడా సుచిత్ర ఆరోపణలు చేయడం విశేషం.

సుచీ లీక్స్ కి బలైన వారిలో నటి రేష్మ పసుపులేటి కూడా ఉన్నారు. ఆమెది ఏకంగా ఓ ప్రైవేట్ వీడియో బయటకు వచ్చింది. బాయ్ ఫ్రెండ్ తో బెడ్ షేర్ చేసుకుంటున్నట్లున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అప్పుడే కోలీవుడ్ లో ఎదుగుతున్న రేష్మ పసుపులేటి ప్రైవేట్ వీడియో బయటకు రావడం కలకలం రేపింది . సదరు వీడియో గురించి రేష్మా పసుపులేటి తాజాగా స్పందించారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు, మానసిక క్షోభ, ఫ్యామిలీ మెంబర్స్ పడ్డ బాధను వివరించారు.
మా చెల్లెలు నాకు ఆ వీడియో గురించి కాల్ చేసి చెప్పారు. అక్కా నీది అంటూ ఒక ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు… అంటూ ఫోన్ లో చెప్పింది. నాకు చాలా భయం వేసింది. బాయ్ ఫ్రెండ్ తో రేష్మా ప్రైవేట్ వీడియో అంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు.ఇప్పటికీ నేను సింగిల్ గానే ఉన్నాను. ఆ వీడియోలో నా ఫేస్ మార్ఫింగ్ చేశారు. నా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని చాలా భాధపడ్డాను. అప్పుడు నేను పడ్డ వేదన వర్ణించలేను, అని రేష్మా తాజాగా అప్పటి చేదు అనుభవాలు గుర్తు చేసుకున్నారు.

తెలుగు అమ్మాయి అయిన రేష్మా పసుపులేటి యాంకర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆమె న్యూస్ రీడర్ గా కూడా పని చేశారు. 39ఏళ్ల రేష్మా చాలా కాలంగా పరిశ్రమలో ఉన్నారు. ఆమె అనేక టెలివిజన్ సీరియల్స్ లో నటించారు. 2015లో విడుదలైన తమిళ చిత్రం మాసాల పడం తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. 2016లో తమిళ, మలయాళ చిత్రాలు అధికంగా చేశారు. అనంతరం సుచి లీక్స్ ఉదంతం చోటుచేసుకుంది. దాంతో ఆమెకు సినిమా ఆఫర్స్ రాలేదని సమాచారం. 2021లో మరలా మూడు తమిళ చిత్రాల్లో నటించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా విడుదలైన హైవే మూవీలో రేష్మా నటించారు.
https://twitter.com/Vishnu1310/status/1608406178287190018?s=20&t=5cHCaK5ns3sfeEb46chiTQ