Revanth – Sri Satya: బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు రసవత్తరమైన టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ముందుకు దూసుకుపోతుంది..ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా బిగ్ బాస్ ‘స్నేక్ vs ల్యాడర్’ గేమ్ ని నిర్వహించాడు..ఈ గేమ్ లో ఇంటి సభ్యులందరూ నూటికి నూరు శాతం తమ కృషిని అంతా పెట్టి కసి తో ఆటని ఆడారు..ఇక తర్వాత లెవెల్ కి వెళ్లే దాంట్లో భాగంగా ‘నాగమణి’ టాస్కుని నిర్వహించాడు బిగ్ బాస్.
ఈ టాస్కులో సంచలకులుగా బిగ్ బాస్ నియమించిన ఇనాయ – వాసంతి ని ఎవరు నాగమణులను డిఫెండ్ చేసుకోవాలి అనేది నిర్ణయించుకొని ‘ల్యాడర్’ టీం ని ఢిఫెండర్లు గా..’స్నేక్’ టీం ని అటాకర్స్ గా ఎంచుకున్నారు.. ఇందులో భాగంగా ల్యాడర్ టీంకు చెందిన ఇంటి సభ్యులు తమ నాగమణులను కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డారు..అందులో భాగంగా అటాకింగ్ కి వచ్చిన వారిని రేవంత్ నిలువరించడంలో సక్సెస్ అయ్యాడు..కానీ ఆ క్రమం లో ఫిజికల్ కూడా అయ్యాడు.
సంచలాక్ ఇనాయ మధ్యలో ఫిజికల్ అవ్వకూడదు అని రూల్ పెట్టడంతో రేవంత్ ఆటని ఆడడం ఆపేస్తాడు..’మీకు ఇష్టమొచ్చినట్టు రూల్స్ మార్చేసుకుంటే మేము ఆడాలా?.. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ బుక్ లో బుధ్ధి బలం, కండబలం ఉపయోగించొచ్చు అని ఉంది..బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ని సంచలక్స్ అయినంత మాత్రాన మధ్యలో ఎలా మారుస్తారు’ అని రేవంత్ గొడవకి దిగి ఆట ఆడడం మానేస్తాడు.. అప్పుడు ఒకే టీం లో ఉన్న శ్రీ సత్య ‘ఆట ఆడు రేవంత్..చూసుకొని ఆడు..ఫిజికల్ గా ఆడొద్దు’ అంటూ గొడవ పెట్టుకుంటుంది.
సొంత టీంలో వాళ్ళే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇక నేను గేమ్ ఎవరి కోసం ఆడాలి..మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి..ఎవరైనా అటాకింగ్ కి వస్తే నేను ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తాను..ఎత్తి అవతల వెయ్యను అంటూ రేవంత్ అలుగుతాడు..అప్పుడు సత్య అటాకింగ్ కి నామీద వస్తున్నారు..నన్ను కాపాడు రేవంత్ ఆట ఆడు అంటూ గొడవ పడుతుంది.
ఇక ఆ తర్వాత రేవంత్ ఒంటరిగా కూర్చొని కంటతడి పెట్టుకుంటూ ‘కోపం కోపం అని చెప్పి నా చేతులు కాళ్ళు కట్టేసారు బిగ్ బాస్..ఏమైనా ఎక్కువ చేస్తే రెడ్ కార్డు ఇచ్చి పంపేస్తారంట..ఆ మాత్రం దానికి నేను ఇక్కడకి రాకపోయినా బాగుండును’ అంటూ బాధపడుతాడు.