Maha Venkatesh On KGF: సాధారణంగా ఓ సినిమా డైరెక్టర్ ఇంకో సినిమా తీసిన వ్యక్తిని మెచ్చుకుంటారు. ఎందుకంటే అంతా ఇండస్ట్రీకి చెందిన వారే కాబట్టి. కానీ తాజాగా తెలుగు సినిమా డైరెక్టర్ కేజీఎఫ్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ నీచ్ కమీన్ కుత్తే సినిమాల్లో విలువలు లేకున్నా ఆదరిస్తారని.. విలువలతో కూడిన తమ సినిమాలను డీ గ్రేడ్ చేస్తారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ డైరెక్టర్ చేసిన దారుణ కామెంట్లపై తీవ్ర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆయన ఎందుకలా మాట్లాడారు? ఎవరా డైరెక్టర్?
Also Read: Adipurush: ‘ఆదిపురుష్’ చిత్రం ఇక విడుదల అవ్వదా..!ప్రభాస్ అభిమానులకు గుండెలు పగిలిపొయ్యే వార్త
‘కేరాఫ్ కంచరపాలెం’.. చిన్న సినిమా అయినా ఇది ప్రేక్షకుల మనసును దోచుకుంది. లైప్ యాంథాలజీగా వచ్చిన ఈ మూవీని వెంకటేష్ మహా డైరెక్షన్ చేశారు. ఈ సినిమా తరువాత ఆయన ‘ఉమా మహేశ్వర’అనే డిఫరెంట్ మూవీ తీసి ఆకట్టుకున్నాడు. ఆయితే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయనతో పాటు నందనిరెడ్డి, ఇంద్రగంటి మోహన కృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ అనే డైరెక్లర్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కేజీఎఫ్ మూవీని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశారు.
‘మంచి కథలతో మేం ఐదుగురం చాలా సినిమాలు తీశాం. మా సినిమాల్లో అభ్యుదయ భావాలు ఎక్కువగా కనిపిస్తాయి. మేం గనుక అభ్యుదయ భావాలు పక్కనబెట్టి వయలెన్స్ సినిమాలను కూడా ఎంతో బాగా తీయగలం. అయితే సినిమాల్లో విలువలు ఉండాలన్నదే మా ఉద్దేశం.. కానీ మా సినిమాలను చూసి డిగ్రేడ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని వయలెన్స్ ప్రధానంగా ఉండే సినిమాలకు హైప్ తీసుకొచ్చి హిట్టు చేస్తున్నారు. ’
‘ఓ సినిమా లాస్ట్ లో తవ్వినవాళ్లకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇచ్చి.. ఆ బంగారాన్నంతా తీసుకెళ్లి సముద్రంలో పడేసే నీచ్ కమీన్ గాడి మీద సినిమా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం.’ అంటూ కేజీఎఫ్ డైరెక్టర్ ను బేస్ చేసుకొని వెంకటేవ్ కామెంట్స్ చేశారు. అయితే వెంకటేశ్ మహా చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో రకరకాలుగా చర్చ సాగుతోంది. సినిమా బాగా లేనిదే అంత పెద్ద హిట్టు అవుతుందా? నీకు నచ్చకపోతే ఎవరికీ నచ్చొద్దా..? అంటూ మీమ్స్ వేసి ట్రోల్ చేస్తున్నారు.