Rashmi Gautam: బీచ్ లో అది లేకుండా యాంకర్ రష్మీ గౌతమ్.. వీడియో వైరల్!

Rashmi Gautam: సమ్మర్ వచ్చిదంటే సెలెబ్రిటీలు నచ్చిన అందమైన ప్రదేశాలకు చెక్కేస్తారు. స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం ఓ ట్రిప్ లో ఉన్నారు. ఆమె చల్లని సాగర తీరానికి విహారానికి వెళ్లారు. రష్మీ తన ట్రిప్ ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉండగా వైరల్ అవుతున్నాయి. తాజాగా రష్మీ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. బీచ్ పక్కన ఆమె క్యాంపు పెట్టారు. సాయంత్రం వేళ బీచ్ పార్టీకి అవసరమైన ఏర్పాట్లు మొత్తం […]

Written By: Shiva, Updated On : April 22, 2023 2:15 pm
Follow us on

Rashmi Gautam

Rashmi Gautam: సమ్మర్ వచ్చిదంటే సెలెబ్రిటీలు నచ్చిన అందమైన ప్రదేశాలకు చెక్కేస్తారు. స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం ఓ ట్రిప్ లో ఉన్నారు. ఆమె చల్లని సాగర తీరానికి విహారానికి వెళ్లారు. రష్మీ తన ట్రిప్ ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉండగా వైరల్ అవుతున్నాయి. తాజాగా రష్మీ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. బీచ్ పక్కన ఆమె క్యాంపు పెట్టారు. సాయంత్రం వేళ బీచ్ పార్టీకి అవసరమైన ఏర్పాట్లు మొత్తం చేశారు. సముద్ర తీరంలో నిల్చొని రష్మీ గౌతమ్ వాతావరణం ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ వీడియోలో రష్మీ నేచురల్ లుక్ లో దర్శనమిచ్చారు. రష్మీ మేకప్ వేసుకోలేదు. అయితే బీచ్ వేర్లో సో హాట్ గా ఉంది. రష్మీ వీడియో చూసిన నెటిజన్లు టెంప్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మీ కెరీర్ పరిశీలిస్తే యాంకర్ గా ఆమె దూసుకుపోతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో ఆమె సందడి చేస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ గా ఉన్న రష్మీ అక్కడ తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు.

అయితే రష్మీకి హీరోయిన్ ఆఫర్స్ రావడం లేదు. గతంలో ఆమె వరుసగా చిత్రాలు చేశారు. కానీ రష్మీ హీరోయిన్ గా నటించిన చాలా చిత్రాలు పరాజయం పొందాయి. దీంతో మేకర్స్ ఆమెను పట్టించుకోవడం లేదు. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. నందు హీరోగా నటించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అక్కడ సక్సెస్ కావడం అంత సులభం కాదని రష్మీకి అర్థమైంది. అందుకే బుల్లితెర మీద పూర్తి ఫోకస్ పెట్టింది.

Rashmi Gautam

మరోవైపు రష్మీ పెళ్లి వార్తలు తరచుగా తెరపైకి వస్తున్నాయి. ఆమె కూడా ఎపిసోడ్స్ కి హైప్ తేవడానికి ఫేక్ లీక్స్ ఇస్తుంది. 35 ఏళ్ల రష్మీ ఎప్పుడు వివాహం చేసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక చాలా కాలంగా సుడిగాలి సుధీర్-రష్మీ బుల్లితెర లవర్స్ గా ప్రచారం పొందారు. దీంతో రష్మీ-సుధీర్ వివాహం చేసుకునే అవకాశం కలదనే ప్రచారం జరుగుతుంది. సుధీర్ సైతం పెళ్లి చేసుకోవడం లేదు. ఇంటర్వ్యూలలో అడిగితే మేము స్నేహితులం మాత్రమే అంటుంటారు. వారి మధ్య రిలేషన్ ఏంటనేది వారికే తెలియాలి.