https://oktelugu.com/

Taraka Ratna : గుండెల్ని పిండేస్తున్న తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదు

Tarakaratna’s wife Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణవార్త తో టాలీవుడ్ మొత్తం ప్రస్తుతం తీవ్రమైన దుఃఖం లో మునిగిపోయింది.గుండెపోటు వచ్చి నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో గత 23 రోజుల నుండి చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడిన తారకరత్న, ఇలా తన పుట్టిన రోజు కి మూడు రోజుల ముందు చనిపోవడం నందమూరి కుటుంబానికి ఎంతటి బాధ కలిగించి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆయన పుట్టినరోజు నాడే కుటుంబ సభ్యులు చిన్న ఖర్మ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2023 / 09:11 PM IST
    Follow us on

    Tarakaratna’s wife Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణవార్త తో టాలీవుడ్ మొత్తం ప్రస్తుతం తీవ్రమైన దుఃఖం లో మునిగిపోయింది.గుండెపోటు వచ్చి నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో గత 23 రోజుల నుండి చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడిన తారకరత్న, ఇలా తన పుట్టిన రోజు కి మూడు రోజుల ముందు చనిపోవడం నందమూరి కుటుంబానికి ఎంతటి బాధ కలిగించి ఉంటుందో ఊహించుకోవచ్చు.

    ఆయన పుట్టినరోజు నాడే కుటుంబ సభ్యులు చిన్న ఖర్మ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా, పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరై తారకరత్న కి నివాళులు అర్పించారు.నిన్న మొత్తం ఈ చిన్న ఖర్మ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ ఉన్నాయి.ఆ వీడియోలలో తారకరత్న బిడ్డలను చూస్తూ ఉంటే కన్నీళ్లు రాక తప్పదు.ఇంత చిన్న వయస్సులో వాళ్ళు తండ్రి ప్రేమని కోల్పయేంత తప్పు ఏమి చేసారంటూ నెటిజెన్స్ బాధపడుతూ పోస్టులు పెట్టారు.

    ఇది ఇలా ఉండగా అలేఖ్య రెడ్డి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.రీసెంట్ గా ఆమె తారకరత్న ని తల్చుకుంటూ పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.తన కూతురుతో కలిసియున్న ఫోటోని షేర్ చేస్తూ ‘ఒక గొప్ప తండ్రికి, ఒక గొప్ప భర్త కి మరియు ఒక గొప్ప మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు, నిన్ను మిస్ అవుతున్నందుకు నేను ఎంతో బాధపడుతున్నాను, ఐ లవ్ యూ సో మచ్’ అంటూ ఆమె పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

    అంతే కాకుండా నిన్న చిన్న ఖర్మ జరుగుతున్నప్పుడు తన భర్త కి నివాళులు అర్పిస్తున్న సమయంలో ఆమె బోరుమని విలపించింది.ఆమెని కుటుంబ సభ్యులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు.ఆ వీడియోలను చూస్తే ఎలాంటి వాడికైనా హృదయం చలించి పోతుంది.ఎంతో గొప్ప మనిషిగా ఇండస్ట్రీ లో ప్రేమాభిమానాలు పొందిన తారకరత్న ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.