
Tarakaratna’s wife Alekhya Reddy : నందమూరి తారకరత్న చనిపోయిన ఘటన నుండి నందమూరి కుటుంబం మరియు నందమూరి అభిమానులు ఇంకా కోలుకోలేదు.నిన్ననే ఆయన పెద్ద కర్మ ని బంధుమిత్రుల సమక్ష్యం లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం హాజరై తారకరత్నకి కన్నీటి నివాళులు అర్పించారు.ఇక తారకరత్న చనిపోయిన రోజు నుండి నేటి వరకు ఆయన భార్య అలేఖ్య రెడ్డి మానసిక స్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాము.
ఆమె ఏడవని క్షణం అంటూ లేదు,భర్త ని తలచుకొని ప్రతీ రోజు ఏడుస్తూనే ఉంది.ఇక సోషల్ మీడియా లో అయితే తారకరత్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అలేఖ్య రెడ్డి ప్రతీ రోజు పెడుతున్న పోస్టులు చూస్తే ఎలాంటి వాడికైనా కన్నీళ్లు రాక తప్పదు.తానే ప్రపంచం గా బ్రతుకుతున్న అలేఖ్య రెడ్డి కి తన ప్రపంచం మొత్తం ఒక్కసారిగా సూన్యం అయిపోవడం తో దిక్కుతోచని స్థితిలోకి అలేఖ్య రెడ్డి వెళ్ళింది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది.అంతే కాకుండా తారకరత్న తనకి చివరిగా రాసిన లేఖని పోస్ట్ చేస్తూ ‘జీవితం లో నువ్వు నేను ఎన్నో అవమానాలను, ఎన్నో కష్టాలను ఎదురుకున్నాము.చివరికి వాటి అన్నిటినీ విజయవంతంగా ఛేదించి మనకంటూ ఒక చిన్న కుటుంబాన్ని ఏర్పర్చుకున్నాము.ఇక నుండి మనం ప్రశాంతం గా జీవించొచ్చని కలలు కన్నాము, ఇంతలోపే ఇదంతా జరిగిపోయింది.నిన్ను నీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేకపోయారు.కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అంటే కచ్చితంగా ఆమె తారకరత్న తల్లితండ్రులను ఉద్దేశించే అనిందని అభిమానులు భావిస్తున్నారు.రోజురోజు కి అలేఖ్య రెడ్డి పడుతున్న బాధ చూస్తుంటే అయ్యో పాపం అని అనిపించక తప్పదు.ఆమె త్వరగా ఈ మనోవేదన నుండి బయటపడి మామూలు స్థితికి రావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
