https://oktelugu.com/

A mother’s story : కూతురు కోసం తండ్రిగా మారిన తల్లి కథ ఇదీ

A mother’s story : ఈ సమాజంలో మగతోడు లేని మహిళను ఎంత లోకువగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లైన 15 రోజులకే భర్త చనిపోయి.. అతడి ప్రతిరూపం కడుపులో పడితే ఆ మహిళ ఆవేదన అంతా ఇంతాకాదు.. కానీ కడుపులోని బిడ్డ కోసం బతికి.. మరో పెళ్లి చేసుకోకుండా ఆమెను చదివించి.. మగాళ్ల వేధింపులు తాళలేక ఒక తల్లి… తండ్రిగా మారింది. ఆమె స్ఫూర్తిగాత ఇప్పుడు సమాజానికి ఒక కొత్త స్ఫూర్తిని పంచుతోంది. తమిళనాడుకు చెందిన […]

Written By:
  • NARESH
  • , Updated On : May 13, 2022 / 03:04 PM IST
    Follow us on

    A mother’s story : ఈ సమాజంలో మగతోడు లేని మహిళను ఎంత లోకువగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లైన 15 రోజులకే భర్త చనిపోయి.. అతడి ప్రతిరూపం కడుపులో పడితే ఆ మహిళ ఆవేదన అంతా ఇంతాకాదు.. కానీ కడుపులోని బిడ్డ కోసం బతికి.. మరో పెళ్లి చేసుకోకుండా ఆమెను చదివించి.. మగాళ్ల వేధింపులు తాళలేక ఒక తల్లి… తండ్రిగా మారింది. ఆమె స్ఫూర్తిగాత ఇప్పుడు సమాజానికి ఒక కొత్త స్ఫూర్తిని పంచుతోంది.

    తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్ కు 20 ఏళ్ల వయసులో వివాహమైంది. పెళ్లైన 15 రోజులకే భర్త చనిపోయాడు. కాసిన్ని రోజుల కాపురానికే ఆమె కడుపులో ఒక కాయ కాసింది. ఒక బిడ్డకు జన్మనించింది. భర్త లేకున్నా ఆ కూతురియే అన్నీ సర్వస్వం అనుకొని ఆమె పోరాడటం మొదలుపెట్టింది.

    Also Read: Telugu Bigg Boss Non Stop: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అనసూయ.. నటరాజ్‌ పై కోపంతో ‘దుర్గ మాత’గా బిందు మాధవి !

    అయితే ఒంటరి మహిళ కావడం వల్ల ఎంతో మంది తప్పుడు చూపులు చూసేవారు. వెంటపడి వేధించేవారు. లైంగిక వేధింపులు కోకొల్లలు. ఈక్రమంలోనే ఒకసారి ఆ లారీ డ్రైవర్ అత్యాచారం చేసినంత పనిచేశాడు. ఒక వ్యక్తి సాయంతో అతడి నుంచి తప్పించుకున్న పెచ్చియామ్మల్ ఇక తాను ఆడదాన్నిగా ఉంటేనే ఈ అత్యాచారాలని డిసైడ్ అయ్యి మగవాడిలా మారిపోయింది. తిరుచునారు అమ్మవారి వద్దకు వెళ్లి గుండు గీయించుకొని.. చీర విప్పేసి ప్యాంట్, షర్ట్ వేసుకొని పురుషుడిలా మారిపోయింది.

    తనను, తన కూతురిని కాపాడుకోవడం కోసం ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం కోసం ఇలా తల్లి తండ్రిగా మారింది. మృగాళ్ల వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది.

    పేదరికం వల్ల పనిచేయడం తప్పనిసరి. అందుకే సమాజంలో మహిళ ఒంటరిగా పనిచేయడం కష్టం. అందుకే ఇలా మగాడిగా మారి పురుషుల దృష్టిలో పడకుండా బతికేస్తోంది. కూలీనాలీ చేసుకున్న ఈమె ఇప్పుడు టీ, పరోటా షాపుల్లో పనిచేసి ముత్తు మాస్టర్ గా పేరుగాంచింది. ఇలా 30 ఏళ్ల పాటు పురుషుడిగానే సవాళ్లను ఎదుర్కొంటూ మగరాయుడిలా బతికింది ఈ పెచ్చియామ్మాల్. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పెచ్చియామ్మాల్ ఎంచుకున్న ఈ మార్గం ఎంతో సాహసోపేతమైందని పలువుకు కొనియాడుతున్నారు.

    Also Read: RRR OTT Trailer : మైండో బ్లోయింగ్ విజువల్స్.. ఓన్లీ ఫర్ ఓటీటీ.. ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..
    Recommended Videos