https://oktelugu.com/

Tamannaah: వాళ్ళిద్దరితో నాకు పెళ్లి జరిగి చాలా రోజులు అయిపోయింది..హీరోయిన్ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

Tamannaah: సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరు తమన్నా..దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన తమన్నా, ఇప్పటికి మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు..ఏడాదికి ఒక కుర్ర హీరోయిన్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్న ఈరోజుల్లో తమన్నా ఇప్పటికి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగడం మాములు విషయం కాదు..ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు ఓటీటీ సినిమాలు ఉన్నాయి..వీటితో పాటు ఆమె మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘భోళా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2022 / 03:12 PM IST
    Follow us on

    Tamannaah: సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరు తమన్నా..దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన తమన్నా, ఇప్పటికి మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు..ఏడాదికి ఒక కుర్ర హీరోయిన్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్న ఈరోజుల్లో తమన్నా ఇప్పటికి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగడం మాములు విషయం కాదు..ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు ఓటీటీ సినిమాలు ఉన్నాయి..వీటితో పాటు ఆమె మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘భోళా శంకర్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

    Tamannaah

    అంతే కాకుండా ఒక మలయాళం సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించబోతుంది..అయితే గత కొంతకాలంగా తమన్నా పెళ్లి గురించి సోషల్ మీడియా లో అనేక వార్తలు వచ్చాయి..రీసెంట్ గా ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొన్న తమన్నా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చెయ్యగా,అది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    ఆమె మాట్లాడుతూ ‘నా పెళ్లి గురించి మా ఇంట్లో ఒత్తిడి పెడుతున్న మాట వాస్తవమే..సంబంధాలు కూడా చూస్తున్నారు..కానీ ఈలోపే నాకు ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త తో పెళ్లి అయిపోయినట్టు..ఒక స్టార్ హీరో తో పెళ్లి జరిగిపోయినట్టు ఇలా సోషల్ మీడియా లో నాకు రెండు సార్లు పెళ్లి చేసేసారు..వాస్తవానికి అందులో ఎలాంటి నిజం లేదు..ఒకవేళ నాకు పెళ్లి ఫిక్స్ అయితే నేనే చెప్తాను కదా..పెళ్లి విషయం లో సీక్రెట్ మైంటైన్ చెయ్యాల్సిన అవసరం నాకి ఏమాత్రం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

    Tamannaah

    ఇక తమన్నా హీరోయిన్ గా సత్యదేవ్ హీరో గా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం ఈ నెల 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా లవ్ మాక్ టైల్ అనే సినిమా కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది.. షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు విడుదలకు నోచుకుంది..బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.

    Tags