Tamannaah : 2018లో విడుదలైన లస్ట్ స్టోరీస్ యంతాలజీ సిరీస్ సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు చేశారు. బోల్డ్ సన్నివేశాల్లో పిచ్చెక్కించారు. కియారా అద్వానీ మాస్టర్బేషన్ సన్నివేశం చేయడం సంచలనం రేపింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాగా ఆ ఫ్లాట్ ఫార్మ్ కి చాలా ప్లస్ అయ్యింది. లస్ట్ స్టోరీస్ విడుదలైన నాలుగేళ్ళ తర్వాత లస్ట్ స్టోరీస్ 2 అందుబాటులోకి వస్తుంది. జూన్ 29 నుంచి స్ట్రీమ్ కానుంది.
అనూహ్యంగా ఈ బోల్డ్ సిరీస్లో తమన్నా నటించారు. సీతారామం ఫేమ్ మృణాల్, సీనియర్ హీరోయిన్ కాజోల్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. లస్ట్ స్టోరీస్ పార్ట్ 2 లో శృంగార సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ సిరీస్ సక్సెస్ కి కారణం కూడా బోల్డ్ కంటెంట్. ఈ క్రమంలో లస్ట్ స్టోరీస్ 2 లో సైతం శృంగార సన్నివేశాలు, అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుందని ఆడియన్స్ ఎక్ష్పెక్త్ చేస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2 టీజర్ విడుదల చేశారు. టీజర్లో అభ్యంతకర సన్నివేశాలు లేవు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం ఉన్నాయి.
ఒక షాట్ లో నటుడు విజయ్ వర్మతో తమన్నా బెడ్ పై ఉన్నట్లు చూపించారు. విజయ్ వర్మతో తమన్నా ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వస్తుండగా… వారిద్దరూ లస్ట్ స్టోరీస్ 2లో కలిసి నటించారు. బహుశా ఈ సీరీస్ షూటింగ్లోనే ఇద్దరి మనసులు కలిశాయేమో. ఏది ఏమైనా లస్ట్ స్టోరీస్ 2 పై అంచనాలు పెరిగాయి. అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కి, సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరోవైపు తమన్నా తెలుగులో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. చిరంజీవికి జంటగా ఆమె రెండోసారి నటిస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. భోళా శంకర్ తమిళ హిట్ వేదాళం రీమేక్. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె చెల్లి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. భోళా శంకర్ ఆగష్టు 11న విడుదల కానుంది.