Big Bash League: ఆస్ర్టేలియాలోని బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో సంచలనం జరిగింది. అడిలైడ్ స్ట్రైకర్స్ జరిగిన మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌట్ కావడం రికార్డు సృష్టించింది. గతంలో టర్కీ పేరిట ఉన్న రికార్డును సిడ్నీ థండర్స్ తిరగరాసింది. టీ20 చరిత్రలోనే ఇంత తక్కువ స్కోరు సాధించిన జట్టుగా గుర్తింపు పొందడం గమనార్హం. కేవలం 5.5 ఓవర్లలోనే టీం మొత్తం అవుట్ కావడం ఇదే ప్రథమం. అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ తో జరిగిన మ్యాచ్ లో 15 పరుగులకే సిడ్నీ థండర్స్ చాప చుట్టేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ర్టైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలో నిలిచిన సిడ్నీ థండర్స్ కేవలం 5.5 ఓవర్లలోనే మొత్తం ఆలౌటైంది. ఎవరు కూడా సింగిల్ డిజిట్ దాటలేదు. డబుల్ అంకెల స్కోరుకు ఒక్కరు కూడా చేరుకోలేదు. దీంతో సిడ్నీ థండర్స్ చేతులెత్తేయడం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లు అయింది. అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టులో క్రిస్ లిన్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా కొలిన్ డి గ్రాండ్ హోమ్ 33 పరుగులు చేశాడు.
సిడ్నీ థండర్స్ బౌలింగ్ లో పజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా ురీందర్ సందు, డేనియల్ సామ్స్, బ్రెండన డోగ్లెట్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తరువాత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ అత్యల్ప స్కోరుకే కుప్పకూలడం జరిగింది. అలెక్స్ హెల్స్, రిలీ రొసౌ, డేనియల్ సామ్స్ జాసన్ సంగా లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా మొత్తం పేకమేడలా కూలిపోయారు. హెన్రీ థోర్టన్, వెన్ అగర్ లు పోటీ పడుతూ వికెట్లు తీయడంతో సిడ్నీ థండర్స్ పెవిలియన్ కు దారి పట్టింది. ఐదుగురు డకౌట్ కావడంతో మిగతా ఆరుగురు సింగిల్ డిజిట్ కే ఇంటిముఖం పట్టారు.

టీ20 క్రికెట్ చరిత్రలో ఇంత స్వల్ప స్కోరుకే కట్టడి కావడం ఇదే ప్రథమం. ఇంతకుముందు టర్కీ కూడా 21 పరుగులకే ఆలౌటైంది. వారి రికార్డును సైతం సిడ్నీ థండర్స్ బద్దలు చేయడం రికార్డు సృష్టించినట్లు అయింది. ఇప్పటి వరకు టర్కీ పేరిట ఉన్న అత్యల్ప స్కోరును సిడ్నీ థండర్స్ బ్రేక్ చేయడం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ఇంత చెత్త ఆట ఆడిన వారిపై విమర్శలు వస్తున్నాయి. తక్కువ స్కోరుకు కట్టడి కావడం చరిత్రలో ఇదే తొలిసారి. మొత్తానికి ఆస్ట్ర్రేలియాలో రికార్డులకు రికార్డులు తిరగరాసిన జట్టుగా కీర్తి గడించింది.