Producer Suresh Babu: థియేటర్స్ పంపిణీ విషయంలో టాలీవుడ్ లో కోల్డ్ వార్ నడుస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో పాటు వారసుడు చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. వీటితో పాటు అజిత్ తునివు, మరొక చిన్న చిత్రం విడుదలయ్యే సూచనలు కలవు. ప్రధానంగా చిరంజీవి,బాలకృష్ణ , విజయ్ చిత్రాలకు థియేటర్స్ పంపకం విషయంలో సమస్య నెలకొంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకంటే తక్కువ డిమాండ్ ఉన్న వారసుడు చిత్రానికి దిల్ రాజు పెద్ద మొత్తంలో థియేటర్స్ బ్లాక్ చేసి పెట్టాడనే ప్రచారం జరుగుతుంది.

డబ్బింగ్ మూవీ వారసుడుకి యాభై శాతం థియేటర్స్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు యాభై శాతం థియేటర్స్ దక్కనున్నాయట. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనకు ఎదురు రావాలని చూస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ని ఊహించని దెబ్బ కొట్టాలనేది దిల్ రాజు వ్యూహం అట. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రెండు చిత్రాలకు ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాకుండా పావులు కదుపుతున్నాడట. 2023 సంక్రాంతి సమరం మైత్రి మూవీ మేకర్స్ వర్సెస్ దిల్ రాజు అన్నట్లు మారిందంటున్నారు.
ఈ క్రమంలో థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను కంట్రోల్ చేస్తున్న వారిలో ఒకరిగా ఉన్న సురేష్ బాబు స్పందించారు. ఎవరి చిత్రానికి ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయనే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి నిర్మాణ సంస్థ పరిశ్రమగా వ్యవహరిస్తుంది. పరిశ్రమ క్షేమం కంటే వారి స్వప్రయోజనాలు ఎక్కువైపోయాయి. అందరి సినిమాలు విడుదల కావాలి. అందరికీ థియేటర్స్ కావాలి. అయితే సూపర్ హిట్ సినిమాకు అధిక థియేటర్స్ దక్కుతాయని సురేష్ బాబు తన అభిప్రాయం చెప్పుకొచ్చారు.

ఎన్ని రాజకీయాలు జరిగినా హిట్ మూవీని ఆపలేరు. ప్రేక్షకులు కోరుకుంటున్న సినిమాకు ఆటోమేటిక్ గా థియేటర్స్ లభిస్తాయి, వాటి సంఖ్య పెరుగుతుందని సురేష్ బాబు పరోక్షంగా వెల్లడించారు. కాగా డిసెంబర్ 13న నారప్ప చిత్రాన్ని వెంకటేష్ బర్త్ డే సందర్భంగా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. నారప్ప అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా రానా హీరోగా గుణశేఖర్ ప్రకటించిన హిరణ్య కశిప వేరే దర్శకుడు చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరో పెద్ద దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ప్రకటిస్తారని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.