https://oktelugu.com/

Tinder And Kindle: కుడి ఎడమయింది.. కోర్టు రూములో నవ్వులు విరిసాయి.. పాపం జడ్జి గారు

గూగుల్ ప్లే స్టోర్ లో కిండల్, టిండర్ అనే పేరుతో యాప్స్ ఉన్నాయి. వీటిలో అమెజాన్ కు చెందిన కిండల్ ఈ_ రీడింగ్ యాప్. ఇందులో సాహిత్యం నుంచి అనేక విషయాలు వరకు అందుబాటులో ఉంటాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 4, 2024 / 11:55 AM IST
    Follow us on

    Tinder And Kindle: కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్. అని వెనుకటికి ఓ సినీ కవి అన్నాడు. కానీ అది పొరబాటే అని చాలా విషయాల్లో నిరూపితమైంది.. కుడి ఎడమైతేనే కాదు.. జస్ట్ పదం తేడా అయినా అర్థమే మారుతుంది. వెనుకటికి ఓ సినిమాలో ఓ కమేడియన్ “త” బదులు “క” పలుకుతాడు. ఫలితంగా ఆ పదాలకు అర్థమే మారుతుంది. అదంటే సినిమా కాబట్టి అలా ఉంటుంది. మరి నిజ జీవితంలో.. పైన చెప్పిన తేడాలు జరిగితే కచ్చితంగా నవ్వులు పూస్తాయి. ఇలాంటి సంఘటన మన దేశంలోని ఓ కోర్టులో జరిగింది. ఆ తప్పిదం అక్కడి జడ్జి చేయడంతో నవ్వులు పూశాయి. ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కడంతో రచ్చ రచ్చ అయిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.\

    గూగుల్ ప్లే స్టోర్ లో కిండల్, టిండర్ అనే పేరుతో యాప్స్ ఉన్నాయి. వీటిలో అమెజాన్ కు చెందిన కిండల్ ఈ_ రీడింగ్ యాప్. ఇందులో సాహిత్యం నుంచి అనేక విషయాలు వరకు అందుబాటులో ఉంటాయి.. ఒక రకంగా దీనిని వికీపీడియా అని అనుకోవచ్చు. టిండర్ అనేది పాపులర్ డేటింగ్ యాప్.
    కిండల్, టిండర్ పదాలు ఒకే తీరుగా ఉండటం.. ఆ పదాలను పలకడంలో ఓ జడ్జి గందరగోళానికి గురి కావడంతో ఒక్కసారిగా కోర్టు రూములో నవ్వులు వెలివిరిశాయి. ఇంతకీ ఇది జరగడానికి ఒక కారణం ఉంది. గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి.. ప్రజలలో చదివే అలవాటు ప్రోత్సహించాలని ఢిల్లీ కోర్టులో ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలయింది. దీనిని జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ అనిరుద్ధ బోస్ విచారించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదిని వారు వివరణ కోరారు. ఈ సందర్భంగా ఈ_ లైబ్రరీలు, పుస్తకాల డిజిటలైజేషన్ కు సంబంధించి ప్రణాళికలు జరుగుతున్నాయని అడిషనల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్ జిత్ బెనర్జీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

    విక్రమ్ జిత్ బెనర్జీ చెప్పిన వివరాల ఆధారంగా జస్టిస్ సంజయ్ కుమార్ స్పందించారు. “ఒక పత్రిక లేదా ఒక పుస్తకానికి సంబంధించి కొత్త పేజీని తిప్పడంలో కలిగే ఆనందం, ఆ అనుభూతి డిజిటల్ రీడింగ్ లో ఎక్కడ ఉంది? అది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిదే కదా? మరి దానిని మీరు ఏమని పిలుస్తారు? టిండర్ అని అంటారా?” అని ప్రశ్నించారు. ” నేను చెబుతున్నది కిండల్ గురించి అని” విక్రమ్ జిత్ బెనర్జీ ప్రకటించారు.. అంతేకాదు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను సవరించారు..” మీరు చెప్పింది నిజమే.. టిండర్ అనేది డేటింగ్ యాప్ కదా” అంటూ జస్టిస్ సంజయ్ కుమార్ నవ్వుతూ బదులిచ్చారు. దీంతో కోర్టు రూములో ఒక్కసారిగా నవ్వులు వెల్లి విరిసాయి. కిండల్ అని అనబోయి జస్టిస్ సంజయ్ కుమార్ టిండర్ అని పలకడం.. ఒక్కసారిగా ఆ పదానికి అర్థమే మారిపోయింది. అందుకే మాట్లాడే మాటలో.. పలికే పాలుకులో అర్థం ఉండాలని.. కుడి ఎడమైనా.. ఎడమ కుడి అయినా.. తేడాలు వచ్చేస్తాయని.. పెద్దలు ఊరికే అనలేదు.