https://oktelugu.com/

Sarkaru Vaari Paata 4 days Collections: సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?

Sarkaru Vaari Paata 4 days Collections: సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని జీఎంబీ, మైత్రీ, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. కరోనాతో చాలా సార్లు వాయిదాపడ్డ ఈ మూవీ ఎట్టకేలకు ఇటీవల విడుదలై మహేష్ బాబు అభిమానుల కోరిక తీర్చింది. సర్కారు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 18, 2022 / 04:41 PM IST

    Sarkaru Vaari Paata

    Follow us on

    Sarkaru Vaari Paata 4 days Collections: సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని జీఎంబీ, మైత్రీ, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది.

    Sarkaru Vaari Paata

    కరోనాతో చాలా సార్లు వాయిదాపడ్డ ఈ మూవీ ఎట్టకేలకు ఇటీవల విడుదలై మహేష్ బాబు అభిమానుల కోరిక తీర్చింది. సర్కారు వారి పాట విడుదలైన నాలుగురోజుల్లోనే రికార్డ్ కలెక్షన్స్ ను సాధించింది. పలు ఏరియాల్లో రికార్డ్ వసూళ్లను రాబట్టింది.

    ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక నాలుగోరోజున కూడా బాక్సాఫీస్ దగ్గర ‘సర్కారు వారి పాట’ దూకుడు చూపించి వరల్డ్ వైడ్ గా రూ.12.06 కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకోవడం విశేషం. దీంతో నాలుగురోజుల్లోనే సర్కారు వారి పాట మూవీ రూ.133.80 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది.

    తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాట నాలుగు రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.. నైజాం రూ.27.55 కోట్లు, సీడెడ్ రూ.8.82 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.9.37 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.6.48 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.4.15 కోట్లు, గుంటూరు రూ.7.51 కోట్లు, కృష్ణా రూ.4.52 కోట్లు, నెల్లూరు రూ.2.71 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో షేర్ కలెక్షన్స్ రూ.71.12 కోట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. గ్రాస్ వసూళ్లు చూస్తే రూ.102.60 కోట్లుగా ఉన్నాయి.

    ఇక కర్ణాటకతోపాటు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.4.06 కోట్లు షేర్ రాగా.. ఓవర్ సీస్ లో రూ.10.15 కోట్లు వచ్చాయి. రెండు రోజులకు మొత్తం చూస్తే 85.87 కోట్లు షేర్ వసూళ్లు సాధించాయి. గ్రాస్ వసూళ్ల ప్రకారం ఇది 133.80 కోట్ల మార్కును టచ్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

     

    Recommended Videos