Sunrisers Hyderabad: హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్ల కొనుగోళ్లలో ఎంతో తెలివిగా వ్యవహరించింది. చేతిలో డబ్బు ఉన్నా తొందర పడలేదు. అన్ని ఫ్రాంచైజీల కంటే సన్ రైజర్స్ దగ్గర రూ.42 కోట్లు ఉండటం విశేషం. దీంతో అంతా అనుకున్నారు సన్ రైజర్స్ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేస్తారని. కానీ సన్ రైజర్స్ మాత్రం తనకు కావాల్సిన ఆటగాళ్ల కొనుగోలులో ఎంతో వైవిధ్యం ప్రదర్శించింది. మిగతా ఫ్రాంచైజీల కంటే విభిన్నంగా ఆలోచించింది. పర్సులో అంత డబ్బున్నా తొందరపడలేదు. మంచి ఆటగాళ్ల కోసం తన వ్యూహం ప్రకారమే ఆటగాళ్లను సొంతం చేసుకుంది.

మిగతా ఫ్రాంచైజీలు కొట్టుకుని ఆటగాళ్ల కోసం భారీగా డబ్బులు ఖర్చు చేసినా సన్ రైజర్స్ తనకు ఉపయోగపడతారనే వారి కోసం పెద్ద మొత్తంలో వెచ్చించింది. మిగతా వారిని తక్కువ వేలానికే సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ వ్యూహంపై క్రీడా నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు. సన్ రైజర్స్ స్ట్రాటజీని మెచ్చుకుంటున్నారు. బ్రూక్ కోసం రూ.13 కోట్లు ఖర్చు చేసి మయాక్ అగర్వాల్ ను రూ.8 కోట్లకే సొంతం చేసుకుంది. ఇలా ఆటగాళ్ల ఆట విధానంపై అంచనా వేసి వారిని దక్కించుకుంది. చేతిలో రూ.42 కోట్లున్నా రూ. 35 కోట్లకే 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడం గమనార్హం.
ఐపీఎల్ మినీ వేలంలో ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తమ వ్యూహాల ప్రకారమే కొనుగోలు చేశాయి. కొందరు అడిషనల్ ఆటగాళ్లను తక్కువ ధరకే దక్కించుకున్నాయి. శామ్ కర్రాన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్ ల కోసం సన్ రైజర్స్ ప్రయత్నిస్తుందని అనుకున్నాఆ దిశగా ఆలోచించలేదు. ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ కోసం అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సంచలనం కలిగించింది. సన్ రైజర్స్ ఆలోచన విధానాన్ని అందరు పొగుడుతున్నారు. ఇదే విషయాన్ని సీనియర్ మాజీ ఆటగాడు మజుందార్ ప్రశంసించాడు. ‘వాళ్ల బౌలింగ్ బలంగానే ఉన్నా బ్యాటింగ్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. దీంతోనే బ్యాట్స్ మెన్ కోసమే వారు ఎక్కువ ఖర్చు చేశారు.’ అని అన్నాడు.

మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా సన్ రైజర్స్ విధానాన్ని పొగిడారు. సఫారీ వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టింది. ఇలా సన్ రైజర్స్ అద్భుతమైన స్ట్రాటజీ అమలు చేసిందని గుర్తిస్తున్నారు. డబ్బులు ఉన్నాయని ఇష్టారాజ్యంగా కాకుండా ముందు చూపుతో వ్యవహరించి మంచి జట్టును సమకూర్చుకుంది. ఈ మేరకు సన్ రైజర్స్ మంచి ఆలోచన విధానాన్ని పాటించిందని కొనియాడుతున్నారు. ఇప్పటికైనా సన్ రైజర్స్ మంచి ఫలితాలు సాధించి తన పట్టు నిలుపుకుంటుందని భావిస్తున్నారు.