Sumanth- Vijay Devarakonda: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలం లోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ..హిట్టు/ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా సినిమాకి ఆయన క్రేజ్ పెరుగుతూ వెళ్తుంది..టాక్సీవాలా సినిమా తర్వాత ఆయన చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మరియు ‘లైగర్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి..ముఖ్యంగా లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ మూడేళ్ళ తన ప్రైమ్ కెరీర్ ని సమర్పించాడు.

కానీ పూరి జగన్నాథ్ నిర్లక్ష్యపు టేకింగ్ వల్ల ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం లో ఖుషి అనే చిత్రం లో నటిస్తున్న విజయ్ దేవరకొండ, తన తదుపరి చిత్రం జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం..ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరో గా నటించిన సుమంత్ కథలో దమ్ము ఉంటే ఇతర హీరోల సినిమాల్లో ఎలాంటి పాత్రని చేయడానికైనా సిద్ధం అని ఎన్నో సందర్భాలలో తెలిపాడు..గత ఏడాది విడుదలైన సీతారామం సినిమాలో ఆయన పోషించిన పాత్రకి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో అందరికీ తెలిసిందే..ఆ చిత్రం తర్వాత సుమంత్ ఒప్పుకున్న మరో సినిమా ఇదే.

అయితే అక్కినేని ఫ్యాన్స్ సుమంత్ ఇలా తనకంటే లేట్ గా వచ్చిన కుర్ర హీరోల సినిమాలలో ఇలాంటి పాత్రలు చెయ్యడం పై అభ్యంతరం వ్యక్త పరుస్తున్నారు..పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియచెయ్యబోతున్నాడు ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.