Homeట్రెండింగ్ న్యూస్Sukesh Chandrasekhar : వైరల్ : కవిత కేసు నిందితుడి దాతృత్వం.. ఏం చేశాడంటే?

Sukesh Chandrasekhar : వైరల్ : కవిత కేసు నిందితుడి దాతృత్వం.. ఏం చేశాడంటే?

Sukesh Chandrasekhar: ఢిల్లీ లిక్కర్ స్కాంనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.. ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు. మాగుంట శరత్ చంద్రా రెడ్డి అనే నిందితుడు అప్రవర్ గా మారిన నేపథ్యంలో ఈ కేసు మరో మలుపుతీసుకుంది.. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే నివురుగప్పిన నిప్పులాగా ఈ కేసు ఉంది. ఈ కేసులో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సుఖేష్ చంద్రశేఖర్. ఆర్థిక నేరగాడుగా పేరుపొందిన ఇతడు లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సహాయం చేశానని అప్పట్లో సంచలన లేఖలు బయటకు వదిలాడు. ఢిల్లీలో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇతడు ఆ మధ్య భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వెల్లడించాడు. పలు దఫాలుగా ఆమెకు డబ్బులు చెల్లించానని ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించిన వాట్సప్ సంభాషణలను స్క్రీన్ షాట్ల ద్వారా బయటకు వెల్లడించాడు.. ఈ నిందితుడు ప్రస్తుతం మరో సంచలనానికి కారణమయ్యాడు.

పది కోట్లు పంపించాడు
ఆర్థిక నేరాలకు సంబంధించి ఢిల్లీలో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ 10 కోట్ల విలువైన చెక్కును తన న్యాయవాది ద్వారా రైల్వే శాఖకు పంపించాడు.. మొన్న ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి పిల్లల చదువు కోసం దీనిని ఖర్చు పెట్టాలని ఆయన ఒక లేఖలో రైల్వే శాఖను కోరారు. ఇది తాను కష్టపడి సంపాదించిన డబ్బని, ఆదాయపు పన్ను చెల్లించి మరి ఈ చెక్కు పంపించానని అందులో వివరించాడు. రైల్వే శాఖ అధికారులకు సుఖేష్ చంద్రశేఖర్ తరపు న్యాయవాది ఈ చెక్కును అందజేశారు. ఈ చెక్కును స్వీకరించిన రైల్వే శాఖ ఉన్నతాధికారులు.. దీనిని బ్యాంకులో వేసే ముందు న్యాయశాఖకు ఒక లేఖ రాశారు.. ఆర్థిక నేరాలకు సంబంధించి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ 10 కోట్ల చెక్కు పంపించారని, దీనిని రైలు ప్రమాదంలో మృతి చెందిన పిల్లల చదువు కోసం వాడమని లేఖ రాశారని, ఇది వాడేందుకు అవకాశం ఉంటుందా అని? ఆ లేఖలో కోరారు. అయితే ఈ చెక్కుకు సంబంధించి సోకేష్ చంద్రశేఖర్ అన్ని వివరాలు పంపించిన నేపథ్యంలో వాడవచ్చని న్యాయశాఖ తెలిపింది.. అయితే ఆ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ చెబితే, తాను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు డబ్బు ఇచ్చానని వెల్లడించాడు. అంటే దీనికి సంబంధించిన ఆధారాలు కూడా స్క్రీన్ షాట్ల రూపంలో మీడియాకు విడుదల చేశాడు.
చర్చనీయాంశం
సుఖేష్ చంద్రశేఖర్ 10 కోట్లు ఇవ్వడంతో ప్రస్తుతం మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయింది. కేవలం పిల్లల చదువుకోసమే 10 కోట్లు ఇచ్చిన సుఖేష్ దగ్గర ఇంకా ఎంత డబ్బు ఉందోనని మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఆ దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారిస్తే మరిన్ని నిజాలు బయటపడతాయనే చర్చ సాగుతోంది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సహాయం చేసి తాను జైల్లో ఇరుక్కున్నానని, తాను జైలుకు వెళ్ళినప్పుడు కాపాడుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి మాట ఇచ్చారని, తర్వాత దానిని తప్పారని సుఖేష్ విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నాడు. కవితకు ఎప్పుడు, ఎలా, ఏ రూపంలో డబ్బులు ఇచ్చిన విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టాడు.. జైల్లోనూ సకల సౌకర్యాలు అనుభవించాడు అనే ఆరోపణ ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. ఇంకా ఎన్ని సంచలనాలకు కారణమవుతాడో వేచి చూడాల్సి ఉంది.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular