Sudigali Sudheer: మ్యాజిక్ షోస్ చేసుకుంటూ పూటగడవడమే కష్టం గా ఉంటున్న రోజుల్లో, వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒక మెట్టుగా చేసుకొని నేడు సక్సెస్ ఫుల్ హీరో గా ఇండస్ట్రీ లో నిలబడిన సుడిగాలి సుధీర్ నేటి తరం యువతకి ఆదర్శంగా నిలిచిన వాళ్లలో ఒకరిగా చెప్పుకోవచ్చు..జబర్దస్త్ కామెడీ షో ద్వారా వేణు వండర్స్ టీం లో ఒకడిగా తన బుల్లితెర కెరీర్ ని ప్రారంభించిన సుడిగాలి సుధీర్, ఆ తర్వాత టీం లీడర్ గా మారి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఈటీవీ లో సుడిగాలి సుధీర్ లేనిదే ఎంటర్టైన్మెంట్ షో లేదు అనే రేంజ్ కి ఆయన ఎదిగాడు..ఆ తర్వాత ఆయన తీసుకున్న బోల్డ్ స్టెప్ సినిమాల్లోకి ఎంటర్ అవ్వడం..ఆర్థికంగా బలపడడానికి ఆయన ఈటీవీ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నీ వదులుకోవాల్సి వచ్చింది..హీరో గా వరుసగా సినిమాలను ఒప్పుకోవాల్సివచ్చింది.
చాలా మంది కమెడియన్స్ కెరీర్ పీక్ స్టేజికి వెళ్తున్న సమయం లోనే హీరో గా పలు సినిమాలు ఒప్పుకొని కెరీర్ ని సర్వనాశనం చేసుకున్నారు..సుడిగాలి సుధీర్ కెరీర్ కూడా అలాగే అయిపోతుందని అందరూ అనుకున్నారు..కానీ రీసెంట్ గా ఆయన ‘గాలోడు’ అనే సినిమా ద్వారా బంపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు..టాక్ సరిగాలేకపోయినా కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ని సాధించడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది.

అంతే కాకుండా సుడిగాలి సుధీర్ ఈ సినిమా సక్సెస్ తో కొంతమంది టాప్ డైరెక్టర్స్ మరియు నిర్మాతల దృష్టిలో కూడా పడ్డాడు..లేటెస్ట్ గా ‘సోలో’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘గీత గోవిందం’,’సర్కారువారి పాట’ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురాం పెట్ల సుడిగాలి సుధీర్ తో ఒక సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడట..రీసెంట్ గానే ఆయన సుధీర్ ని ఈ విషయం పై కలిసి మాట్లాడినట్టు తెలుస్తుంది..త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది..క్వాలిటీ లేని సినిమాలు చేస్తేనే సూపర్ హిట్ అవుతున్నాయి అంటే, సుధీర్ తో మంచి సబ్జెక్టు ఉన్న కథ ఎవరైనా చేస్తే కచ్చితంగా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.