Sudigali Sudheer Remuneration: బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్.. అనే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ స్టార్.. కొన్ని రోజుల పాటు రష్మీతో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. జబర్దస్త్ లో సుధీర్, రష్మీ జంట వచ్చిందంటే ఆ ఎపిసోడ్ సందడిగా ఉంటుందని అభిమానులు అంటుంటారు. అయితే జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. సుడిగాలి సుధీర్ కూడా తనకు సినిమా అవకాశాలు రావడంతో కామెడీ షో ను విడిచిపెట్టారు. ఈ తరణంలో ఆయన ‘గాలోడు’ అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ మూవీ నవంబర్ 18న రిలీజ్ కాబోతుంది. ‘గాలోడు’ సినిమాకు సుధీర్ ఇంతవరకు ఏ సినిమా, ప్రోగ్రాంకు తీసుకొని రెమ్యూనరేషన్ ను దక్కించుకున్నాడు. ఇంతకీ ఆయన పారితోషికం ఎంతో తెలుసా..?

‘గాలోడు’ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘సాఫ్ట్ వేర్ సుధీర్, ‘3 మంకీస్’ లాంటి సినిమాల్లో నటించిన సుధీర్ నటన ఆకట్టుకుంది. సినిమాలు ఎలా ఉన్నా ఆయన నటనతో విపరీత అభిమానులను పెంచుకున్నారు. దీంతో ఆయన లేటేస్టుగా నటించిన ‘గాలోడు’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నవంబర్ 18 ఎప్పుడొస్తుందా..? అని కొందరు అభిమానులు పండుగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆసలు ఆయన ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనేదానిపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
సుధీర్ ఇప్పటి వరకు నటించిన సినిమాల కంటే ‘గాలోడు’కు రూ.2.5 కోట్ల బడ్జెట్ పెట్టారట. ఇందులో భాగంగా సుధీర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అందుకు తగ్గట్టుగానే రూ.50 నుంచి రూ.60 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా ఈ సినిమా ఉంటుందని సుధీర్ ఇటీవల జరిగిన పలు ఈవెంట్లలో చెప్పారు. ఓ పల్లెటూరు కుర్రాడు గాలోడిగా మారిన తరువాత ఉద్యోగం కోసం సిటీకి వస్తాడు. అక్కడ ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటో ఈ సినిమాలో సుధీర్ మంచి యాక్షన్ చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు.

జబర్దస్త్ ను వీడిన తరువాత సుధీర్ ‘గాలోడు’తో మరోసారి వెండితెరపై కనిపించబోతున్నాడు. టీవీ వేదికగా ఆయన నటనకు ఫ్యాన్స్ తో పాటు తోటి ఆర్టిస్టులు కూడా ఫిదా అయ్యేవారున్నారు. ఇప్పుడు ఆయనను బిగ్ స్క్రీన్ పై చూసి మురిపోతారని అనుకుంటున్నారు. ఇక ఇందులో సుధీర్ కు జోడిగా గెహ్నా సిప్పీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకృతి సమర్పణలో రాజశేఖరరెడ్డి డైరెక్షన్ చేస్తున్నారు.