https://oktelugu.com/

Sudigali Sudheer Marriege: జబర్ధస్త్ సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే?

Sudigali Sudheer Marriege: ఇటీవలే యాంకర్ రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకుందని… అందుకే ఆమెను ప్రేమిస్తున్న మరో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ‘ఢీ’ షో నుంచి తప్పుకున్నాడని జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే 34 ఏళ్ల సుధీర్ కూడా రష్మీ దూరం కావడంతో ఇక తాను కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు బుల్లితెరపై పాపులారిటీని సంపాదించుకున్నారు. గడిచిన ఏడు ఏళ్లుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2022 / 12:32 PM IST
    Follow us on

    Sudigali Sudheer Marriege: ఇటీవలే యాంకర్ రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకుందని… అందుకే ఆమెను ప్రేమిస్తున్న మరో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ‘ఢీ’ షో నుంచి తప్పుకున్నాడని జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే 34 ఏళ్ల సుధీర్ కూడా రష్మీ దూరం కావడంతో ఇక తాను కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

    sudigali sudheer Marriage

    జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు బుల్లితెరపై పాపులారిటీని సంపాదించుకున్నారు. గడిచిన ఏడు ఏళ్లుగా తన కామెడీతో సుడిగాలి సుధీర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అతడు ఈవెంట్ లకు సైతం మంచి రేటింగ్స్ వస్తున్నాయి.

    యాంకర్ రష్మీతో ప్రేమలో ఉన్నాడని.. ఆకారణం వల్లనే పెళ్లిని సుధీర్ వాయిదా వేస్తున్నాడని ప్రచారం సాగింది. అయితే రష్మీకి ఇప్పటికే పెళ్లి అయ్యిందని చెబుతున్నారు. దీంతో సుధీర్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ లు తమ ఫ్రెండ్ పెళ్లి కోసం సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

    వయసు మూడు పదులు దాటడంతో సుడిగాలి సుధీర్ తల్లిదండ్రులు ఒత్తిడి తేవడంతో పెళ్లికి ఒప్పుకున్నట్లు సమాచారం. సుధీర్ సొంత జిల్లాకు చెందిన యువతితోనే అతడి వివాహం జరుగనుందని సమాచారం. సుధీర్ కు కూడా సంబంధం నచ్చి వెంటనే అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

    పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తల విషయంలో సుధీర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కొన్ని నెలల క్రితం ప్రముఖ కమెడియన్ అవినాష్ పెళ్లి జరగగా.. సుధీర్ పెళ్లి కూడా తర్వాత జరిగితే బాగుంటుందని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.

    వివాదాలకు దూరంగా ఉండే సుధీర్ కమెడియన్ గా పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు. సుధీర్ తమ్ముడు ఇప్పటికే వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు సినిమాలు, జబర్ధస్త్ తోపాటు వివిధ ప్రోగ్రాంలతో బిజీగా ఉన్న సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు సమాచారం.

    Tags