Jabardasth Sudigali Sudheer : బుల్లితెర మీద సంచలనం సృష్టించిన ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఒకటి జబర్దస్త్..సుమారు పదేళ్ల నుండి ప్రేక్షకులకు తిరుగులేని వినోదం ని అందిస్తున్న షో ఇది..ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి వచ్చారు..నేడు టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న కమెడియన్స్ గా కూడా మారారు..కానీ సినిమాల్లో ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ కూడా తమని మొట్టమొదటగా ఆదరించిన జబర్దస్త్ షో ని మాత్రం వాళ్ళు ఇప్పటికి వదులుకోలేదు.

కానీ ఈ షో ద్వారా ప్రేక్షకుల్లో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ మాత్రం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల గత కొద్ది నెలల నుండి జబర్దస్త్ నుండి శ్రీ దేవి డ్రామా కంపెనీ వరుకు ఈటీవీ లో ఆయన పాల్గొనే అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ కి గుడ్బై చెప్పి కొన్నేళ్లు స్టార్ మా మరియు జీ తెలుగు చానెల్స్ లో వ్యాఖ్యాతగా కొన్ని షోస్ చేసాడు..వాటితో పాటుగా రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు ఈయన.
అయితే గత కొంతకాలం నుండి సుడిగాలి సుధీర్ బుల్లితెర మీద ఏ షో లో కూడా కనిపించడం లేదు..ఆయన ఫాన్స్ సుధీర్ ని బాగా మిస్ అవుతున్నాం అనే సోషల్ మీడియా పోస్టింగ్స్ పెడుతున్నారు..ఇది ఇలా ఉండగా ఇటీవలే సుధీర్ హీరో గా నటించిన ‘గాలోడు’ సినిమా కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది..అతి త్వరలోనే థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వూస్ ఇచ్చాడు..ఈ ఇంటర్వూస్ లో ఆయన జబర్దస్త్ రీ ఎంట్రీ గురించి అభిమానులకు ఒక శుభవార్త తెలియచేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘జబర్దస్త్ నా కెరీర్ కి అడ్రస్ లాంటిది.. అన్నం పెట్టిన షోని కావాలని వదిలేయలేదు..కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వలన ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..నేను కేవలం ఆ షోకి ఒక 6 నెలలు బ్రేక్ మాత్రమే ఇచ్చాను..ఈ విషయం మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారితో కూడా మాట్లాడాను..వాళ్ళు ఇచ్చిన ప్రత్యేకమైన అనుమతితోనే నేను బ్రేక్ ఇచ్చాను.. అతి త్వరలోనే మళ్ళీ నేను జబర్దస్త్ షోలోకి రాబోతున్నాను’ అంటూ సుడిగాలి సుధీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.