Gaalodu Collections: బుల్లితెర పవర్ స్టార్ అని పిలవబడే సుడిగాలి సుధీర్ హీరో గా నటించిన ‘గాలోడు’ అనే చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచినా సంగతి తెలిసిందే..అసలు ఈ సినిమాకి ఇంత స్టడీ కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అనేది ట్రేడ్ పండితులకు సైతం అంతు చిక్కని ప్రశ్న..ఎందుకంటే ఇప్పటి వరుకు ఈ సినిమాని చూసినోళ్లు ఒక్కరు కూడా బాగుంది అన్నోడు లేదు..అంతటి నెగటివ్ టాక్ వచ్చిన సినిమాకి మొదటి వారం కూడా పూర్తి కాకముందే బ్రేక్ ఈవెన్ అవ్వడం ఏంటి.

పెద్ద హీరోల సినిమాలు సైతం టాక్ సరిగా రాకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడుతున్న ఈరోజుల్లో..ఒక బుల్లితెర స్టార్ సినిమాకి జనాలు ఇలా కదులుతున్నారు ఏమిటి..సుడిగాలి సుధీర్ కి ఇంత క్రేజ్ ఉందా అని విమర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది ఈ చిత్రం..సినిమాకి నెగటివ్ టాక్ వస్తేనే ఇలా ఉంటే ఇక పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ వసూళ్లు వచ్చేవో ఊహించుకోవచ్చు.
ఇప్పటి వరుకు ఈ సినిమా విడుదలై వారం రోజులు అయ్యింది..ఈ వారం రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాము..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 2 కోట్ల 50 లక్షల రూపాయలకు జరగగా మొదటి రోజు కోటి 20 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..రెండవ రోజు మరియు మూడవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం అందరిని షాక్ కి గురి చేసింది..ఇక వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకి స్టడీ కలెక్షన్స్ వచ్చాయి.

అలా మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఇప్పటి వరుకు 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..విచిత్రం ఏమిటంటే ఈరోజు రెండు కొత్త సినిమాలు విడుదలయ్యాయి..అయినా కూడా గాలోడు కలెక్షన్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు..అలా నెగటివ్ టాక్ తో వారం లోపే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి అడుగుపెట్టిన ఏకైక సినిమాగా గాలోడు సరికొత్త రికార్డు ని నెలకొల్పింది.