Sudigali Sudheer- Sreemukhi and Anasuya: బుల్లితెరపై ఎవర్ గ్రీన్ మెగాస్టార్ సుధీర్. ఈ కమెడియన్ తన టైమింగ్ తో అంతలా పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షో చూసేవారికి సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారుండరు. స్టేజీపైకి సుధీర్ టీం వచ్చిందంటే అభిమానులకు పండుగే. ఇక సుధీర్, రష్మీల జోడి కనిపిస్తే మరింత ఉత్సాహం ఉంటుంది. కపుల్స్ లో వీరి జోడి అదుర్స్ అంటారు. అంతేకాకుండా సుధీర్, రష్మీల మధ్య లవ్ కొనసాగుతుందని, వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ వీరు ముద్దు ముచ్చట్ల వరకే పరిమితం అయ్యారు. పెళ్లి పీటల వైపు వెళ్లలేదు. అయినా పీకల్లోతు ప్రేమలో పడ్డారని అన్నారు. కానీ తాజాగా సుధీర్ జబర్దస్త్ ను వదిలి వెళ్లాడు. తన లవర్ రష్మిని మాత్రం తీసుకువెళ్లలేకపోయాడు. అంతేకాకుండా ఇతర టీవీల్లో అనసూయ, శ్రీముఖిలతో కలిసి చెట్టాపట్టలేసుకోవడం చూస్తే.. ఇక రష్మిని వదిలిపెట్టినట్లేనా..? అనే చర్చ సాగుతోంది.
జబర్దస్త్ కామెడీ షో చాలా మంది జీవితాలను మార్చేసింది. ఇందులో పాల్గొన్న వారిలో కొందరు సినిమాల వైపు వెళ్లారు. మరికొందరు ఇతర ఛానెళ్లలో చేస్తున్నారు. అయితే సుడిగాలి సుధీర్ మాత్రం జబర్దస్త్ షో ను విడిచిపెట్టడంపై అనేక రూమర్స్ వస్తున్నాయి. మల్లెమాల మేనేజ్మెంట్ తో వచ్చిన విభేదాలతోనే షో నుంచి బయటకు వచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో సినిమాల్లో పూర్తి కాలం కేటాయించడానికి కామెడీ షో ను వదులుకున్నాడని అంటున్నారు. అయితే సినిమాల కోసమే బయటకు వస్తే.. ఇతర షోలో ఎందుకు కనిపిస్తున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తన ప్రేమ పక్షి రష్మీతో విడిపోవడం దేనికని అంటున్నారు.
లెటేస్టుగా సుధీర్ అనసూయతో కలిసి మా టీవీలో ప్రసారమ్యే ‘సూపర్ సింగర్స్ జూనియర్స్’లో కనిపిస్తున్నాడు. అటు శ్రీముఖితో కలిసి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లోనూ చేస్తున్నాడు. ఈ రెండు షోల్లో అనసూయ, శ్రీముఖిలతో సుధీర్ రెచ్చిపోతున్నాడు. జబర్దస్త్ లో ఉన్నంత కాలం రష్మీ తప్ప మరొకరు సుధీర్ పక్కన కనిపించలేదు. అప్పుడప్పుడు వేరేవాళ్లు కనిపించినా తన ’దిల్ కా దడ్గన్ రష్మీనే’ అని చెప్పేవాడు. కానీ లెటేస్ట్ షోల్లో వితౌట్ రష్మీ సుధీర్ ను చూడడం అభిమానులకు ఇబ్బందిగా మారిందట. దీంతో అసలు రష్మి, సుధీర్ ల మధ్య గొడవ జరిగిందా..? ఎందుకు వీరిద్దరు విడిపోయారు..? అని చర్చించుకుంటున్నారు. మరోవైపు అసలు వీరిద్దరి మధ్య ప్రేమ లేదు.. దోమ లేదు.. అంతా ట్రాష్ ..అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక అభిమానుల ఆవేదన వేరే ఉంది. సుధీర్ చేసే షోల్లో అనసూయ, శ్రీముఖిలను కాకుండా రష్మీనే పెడితే బావుండు కదా.. అని అంటున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదురుతుందని, అప్పుడు ప్రేక్షకులకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ పాత చింతకా పచ్చడేనా..? అప్పడడప్పుడు ఇలాంటి మార్పులు ఉండాలని అంటున్నారు. ఏదీ ఏమైనా సుధీర్, రష్మీలు ఇంతకాలం ప్రేమించుకుంటున్నారని, వీరి ఇప్పుడు కాకపోయినా.. ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటారని అభిమానుల్లో ఆశలు ఉండేవి. కానీ ఇప్పుడు వారి ఆశలు ఆవిరయ్యాయి. సుధీర్ జబర్ధస్త్ ను, ఈటీవీని బయటకు వెళ్లిపోవడంతో వీరి జోడి కలవడం కష్టమేనంటున్నారు. రష్మీ బయటకు వస్తే తప్ప ఇది జరగదంటున్నారు. అయితే సుధీర్ రాను రాను మళ్లీ రష్మీని కలుస్తాడా..? లేక శ్రీముఖి, అనసూయలతోనే ప్రోగ్రాంలు చేస్తాడా.? అనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read:Sai Pallavi-The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ పై సాయిపల్లవి వివాదాదాస్పద కామెంట్స్.. ‘విరాటపర్వం’ బ్యాన్ అంటూ ట్రోలింగ్
Recommended Videos