
Sudhigali Sudheer – Venu : ‘నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయనే.. నాకు మూడు పూటలా భోజనం దొరుకుతుందంటే ఆయన అందించిన సాయమే.. మా ఫ్యామిలీ ఆనందంగా ఉండడానికి ఆయన ఇచ్చిన అవకాశమే..’ అంటూ సుడిగాలి సుధీర్ ఎమెషనల్ అయ్యారు. ఇటీవల ‘బలగం’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనకు జీవితాన్ని ఇచ్చిన స్టార్ కమెడియన్ గురించి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఆ స్టార్ కమెడియన్ ఎవరో తెలుసుకుందాం..
తేజ సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్న వేణు ఆ తరువాత జబర్దస్త్ ప్రొగ్రాంతో మరింత ఫేమస్ అయ్యారు. మున్నా సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్రతో ‘వేణు టిల్లు’గా అందరూ పిలుచుకుంటున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు జబర్దస్త్ కామెడితో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే వేణు టీం లీడర్ గా ఉన్న సమయంలో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ప్రొగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వేణు అవకాశం ఇవ్వడం ద్వారానే ఇంత స్టేజీకి వచ్చానని ఈ సందర్భంగా సుధీర్ చెబుతూ కంటనీరు తెచ్చుకోవడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.
ఇక వేణు కమెడియన్ మాత్రమేకాకుండా ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాలో కమెడిన్ ప్రియదర్శిని హీరో. గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన బేబీ కావ్వ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. బలగం సినిమాకు బిగ్ నిర్మాత దిల్ రాజు కావడం విశేషం. ఇందులో భాగంగా ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్ లో సుడిగాలి సుధీర్ ఎమోషనల్ అవుతూ వేణు గురించి చెప్పారు.
‘ఈవాళ నేను, నా కుటుంబం మూడు పూటల అన్నం తింటున్నామని అందుకు కారణం వేణన్న. కష్ట కాలంలో నన్ను ఆదుకొని జబర్దస్త్ లో అవకాశం ఇచ్చినంది ఆయనే. అందువల్ల ఆ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటా.. ఇప్పటి దాకా వేణన్న మంచి కమెడియన్ గా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి దగ్గర టాలెంట్ ఉందని గుర్తించిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. ’ అని సుధీర్ చెప్పారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా హాజరై సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని ప్రశంసించారు.