
Dil Raju – KTR : దిల్ రాజు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. సినిమా మాఫియాకు ఆయన డాన్ అన్న వాదన ఉంది. 2023 సంక్రాంతి చిత్రాల విడుదల విషయంలో ఎంత రచ్చ జరిగిందో చూస్తూనే ఉన్నాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని ఆయన్ని బేఖాతరు చేశారు. వద్దన్నా డబ్బింగ్ మూవీ వారసుడు సంక్రాంతికి విడుదల చేసి తన పంతం నెగ్గించుకున్నారు. ఇక థియేటర్స్ లాక్ చేసి బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలను ఇబ్బంది పెట్టాలని చూశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. వారసుడు విడుదల జనవరి 14కి వాయిదా వేయడంతో మైత్రి మూవీ మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. డిస్ట్రిబ్యూషన్ హక్కులు తనకు ఇవ్వలేదని, సొంతగా విడుదల చేసుకుంటున్నారనే అక్కసుతో దిల్ రాజు ఇలా చేశారని సమాచారం. అయితే ఈ గేమ్ లో దిల్ రాజే నష్టపోయాడు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు భారీ వసూళ్లు అందుకున్నాయి. ఇక ఎప్పటి నుండో చిన్న సినిమాలను, నిర్మాతలను తొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయాన్ని పరోక్షంగా మంత్రి కేటీఆర్ నొక్కి వక్కాణించి చెప్పారు. దిల్ రాజు ఇటీవల దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో మరో బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆయన కూతురు హన్షిత, బ్రదర్ కొడుకు హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా ఈ బ్యానర్ లో బలగం టైటిల్ తో మూవీ చేశారు. కమెడియన్ టిల్లు వేణు ఈ చిత్ర దర్శకుడు. ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీ మార్చి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
బలగం ప్రీ రిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలో జరిపారు. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బలగం చిత్ర యూనిట్ కి పేరు పేరున అభినందనలు తెలిపిన కేటీఆర్… దిల్ రాజు టార్గెట్ గా కొన్ని కామెంట్స్ చేశారు. హర్షిత, హర్షిత్ రెడ్డి మీ కాళ్ళ మీరు నిలబడాలి. అభిరుచితో సినిమాలు తీసి దిల్ దిల్ రాజును అధిగమించాలి. సెకండ్ జనరేషన్ ఎదగడం అంత ఈజీ కాదు. పేరెంట్స్ ఫ్లాట్ ఫార్మ్ ఇచ్చినా సొంత టాలెంట్ తో ఎదగాల్సిన బాధ్యత మనదే అన్నారు. చివర్లో… నేను మీ గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే మీరు హన్షిత, హర్షిత్ రెడ్డిలను తోక్కేస్తున్నారు. అని దిల్ రాజును ఉద్దేశిస్తూ కేటీఆర్ పలుమార్లు అన్నారు. కేటీఆర్ మాటల వెనుక లోతైన అసహనం ఏదైనా ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి.