spot_img
Homeక్రీడలుShubman Gill: ఆ అరుపులేంది.. శుభమన్ గిల్ ను ఏకిపారేస్తున్నారు..!

Shubman Gill: ఆ అరుపులేంది.. శుభమన్ గిల్ ను ఏకిపారేస్తున్నారు..!

Shubman Gill
Shubman Gill

Shubman Gill: టీమిండియా యువ సంచలనం సబ్ మన్ గిల్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఒకే తరహాలో అవుట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అతనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియా భారత్ మధ్య విశాఖలో ముగిసిన రెండో వన్డేలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైంది. ఏకంగా 10 వికెట్లు తేడాతో చిత్తుగా వోడింది. అయితే ఈ మ్యాచ్ లో కీలక బ్యాట్స్మెన్లు చేతులెత్తేశారు. దీంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ ఏడాది సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్ సుబ్ మన్ గిల్ వరుసగా నిరాశపరుస్తున్నాడు. వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో విఫలమైన గిల్.. విశాఖలో జరిగిన రెండో వన్డేలను అదే ఆట తీరును కనబరిచాడు.

భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే గిల్ డక్ అవుట్ గా వెనుదిరిగాడు. మొదటి ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్లో తొలి రెండు బంతులుకు డాట్ బాల్స్ ఆడిన గిల్.. ఆ తర్వాత బంతికే లబుషేన్ కు సులువైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆప్ స్టంప్ కు దూరంగా పడిన బంతిని షాట్ ఆడి గిల్ తన వికెట్ కోల్పోయాడు. అవుట్ అయిన వెంటనే గిల్ గట్టిగా అరుస్తూ గ్రౌండ్ ను వీడాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్న ఫ్యాన్స్.. గిల్ పై మండిపడుతున్నారు. మొదటి మ్యాచ్ నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, శ్రీలంక పై ఆడినట్లు ఆశిష్ పై ఆడబోతే ఇలాగే ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు. మొదటి మ్యాచ్ లో వేసిన బౌలర్. అదే ఫీల్డర్, అదే బాల్, అదే షాట్, అదే వికెట్ అని పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా గిల్ ను విమర్శిస్తున్నారు.

Shubman Gill
Shubman Gill

ముఖ్యంగా వన్డేల్లో స్టార్క్ బౌలింగ్లో గిల్ ఆట మరీ చెత్తగా ఉంది. టెస్టుల్లో స్టార్క్ ను ఒక ఆట ఆడుకున్న గిల్.. వన్డేల్లో మాత్రం ఇప్పటికి రెండుసార్లు అతనికే వికెట్ ఇచ్చాడు. రెండుసార్లు ఒకే విధంగా అవుట్ కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర అసహనంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ఆట తీరు మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు

Exit mobile version