Subham Trailer: ఇంతకాలం హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత, ఇప్పుడు నిర్మాతగా మారి ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. కొత్త వాళ్ళతో నిర్మించిన ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రొమోషన్స్ ని ఇప్పటి నుండే ప్రారంభించింది సమంత. టీజర్ తోనే ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించిన ఈ చిత్రం, నేడు ట్రైలర్ ద్వారా ఆడియన్స్ లో మరింత అంచనాలను రేకెత్తించింది. కొసమెరుపు ఏమిటంటే ఈ చిత్రం లో సమంత కూడా ఒక కీలక పాత్రలో నటించిందని ట్రైలర్ చివర్లో తెలుస్తుంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి విశ్లేషిద్దాం. ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ అనే దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు.
Also Read: వామ్మో.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..
ఈమధ్య కాలం లో సినిమాలను మన ఆడియన్స్ కొత్తదానం లేకపోతే థియేటర్స్ కి వచ్చి అసలు చూడడం లేదు. కొత్తదనం ఉంటే ఊరు పేరు తెలియని నటీనటుల సినిమాలను కూడా ఆదరిస్తున్నారు మన ఆడియన్స్. అందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. శుభం కూడా అలా నిలవబోతుందని ట్రైలర్ ద్వారా ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేసాడు డైరెక్టర్ ప్రవీణ్. కథ ఏమిటంటే కొత్తగా పెళ్ళైన జంట, సంతోషంగా శోభనం చేసుకోవడానికి గదిలోకి వెళ్తారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఒక సమయం అయ్యేసరికి హీరోయిన్ నేరుగా టీవీ ముందుకెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే సీరియల్ మొదలు అవుతుంది. శోభనం రోజు అసలు కార్యం వదిలేసి టీవీ సీరియల్ చూస్తున్న తన భార్య పై భర్త చిరాకు పడితే దెయ్యం పట్టిన దానిలాగా ప్రవర్తిస్తుంది. టీవీ ఆఫ్ చేయాలనీ చూస్తే భర్త పీక పట్టుకొని విసిరి అవతలకు వేస్తుంది. మిగిలిన సమయాల్లో బాగానే ఉంటుంది కానీ, ఎప్పుడైతే టీవీ సీరియల్ వస్తుందో అప్పుడే దెయ్యం లాగా మారిపోతుంది.
దీనికి నివారణ కోసం ఒక మాత దగ్గరకు వెళ్తారు. ఆ మాత మరెవరో కాదు సమంత నే. ఆ తర్వాత ఏమైంది అనేది తెలుసుకోవాలంటే మే 9 వరకు ఆగాల్సిందే. హారర్ జానర్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ, ఇప్పటి వరకు ఇలాంటి సినిమా మాత్రం రాలేదు. ట్రైలర్ లో చూపించిన విధంగా సినిమా కూడా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగ్ గా ఉంటే కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఈమధ్య కాలం లో నటీనటులు నిర్మాతలుగా మారి భారీ హిట్స్ ని అందుకుంటున్నారు. సమంత కూడా ఆ లిస్ట్ లోకి చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మారాయి ఈ చిత్రం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది.