Strange Love: ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. ఏ వయసులో అయినా ప్రేమ చిగురిస్తుంది. ప్రేమ కలిగితే అది పోవడం కష్టమే. దానికి వయసు తారతమ్యం ఉండదు. తొంబై ఏళ్ల బామ్మను పాతికేళ్ల కుర్రాడు ప్రేమించొచ్చు. డెబ్బయ్యేళ్ల తాతను ఇరవై ఏళ్ల యువతి ప్రేమించవచ్చు. ప్రేమకు అంతరాలు ఉండవు. ప్రేమిస్తే దేనికైనా తెగిస్తారు. ఎందాకైనా వెళతారు. ప్రతి ఒక్కరికి వెర్రి ఉండటం సాధారణమే. అది వ్యక్తుల నడవడిక బట్టి మారుతుంటుంది. లోకంలో కొన్ని ఘటనలు మనకు విచిత్రంగా అనిపించినా వారికి మాత్రం సరైనవిగానే తోస్తాయి.

థాయిలాండ్ కు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆమెతో ఏకంగా నిశ్చితార్థం చేసుకుని అందరిని ఆలోచనల్లో పడేశాడు. ప్రేమకు వయసు అడ్డుకాదని చెబున్నాడు. మాటలు అందరు చెబుతారు. కానీ ఆచరించి చూపేవాడే నిజమైన ప్రేమికుడని నిరూపిస్తున్నాడు. తన మనసుకు నచ్చిన బామ్మను వివాహం చేసుకోవాలని అనుకోవడమే విచిత్రంగా అందరు భావిస్తున్నా అతడు మాత్రం తాను చేసేది సరైందేనని మరోసారి చాటుతున్నాడు.
ఉతిచాయ్ చంతరాజ్ అనే యువకుడు 9 ఏళ్ల వయసు నుంచే 56 ఏళ్ల జన్లా నమువాన్ గ్రాక్ ను ప్రేమిస్తున్నట్లు చెబుతున్నాడు. అదేదో ఆట పట్టించడానికి చెబుతున్నాడని అందరు అనుకున్నారు. కానీ అతడిలో ప్రేమ అలాగే పెరిగింది. బామ్మ వయసున్న ఆమెపై సహజంగానే అతడికి ప్రేమ ఇనుమడించింది. ఇప్పుడు ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నట్లు చెప్పి కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చాడు. అంతే కాదు ఆమెతో నిశ్చితార్థం చేసుకుని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారుతోంది.

సినిమాల్లో చూసేటప్పుడు మనకు గమ్మత్తుగా అనిపించినా ఇలాంటి ప్రేమ కథలను ప్రత్యక్షంగా చూస్తే మనకు ఆశ్చర్యం వేయక మానదు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ప్రేమ అని అందరు పోస్టులు పెడుతున్నారు. కుర్రాడి ధైర్యానికి ఫిదా అవుతున్నారు. అంత వయసున్న ఆవిడను వివాహం చేసుకోవాలనుకోవడం అతడి వీరోచితమే అని చెబుతున్నారు. దీంతో కుర్రాడి చర్యకు పలువురు మంత్రముగ్దులవుతున్నారు. యువకుడు బామ్మను పెళ్లి చేసుకోవడం ఓ వింతగానే భావిస్తున్నారు.