
Steve Smith- MS Dhoni: జార్ఖండ్ డైనమైట్ ధోనీ.. ఆయన ఆటతో క్రికెట్ అభిమానుల మనసు దోచారు. ఇక తన సారథ్యంతో సహచరులతో శభాష్ అనిపించుకున్నారు. ఆయన సారథ్యంలో మ్యాచ్‌లు ఆడేందుకు దేశీయ క్రికెటర్లే కాదు.. విదేశీ క్రికెటర్లు కూడా పోటీపడేవారంటే అతిశయోక్తి కాదు. 2017 ఐపీఎల్ సీజన్లో ధోనీ రైజింగ్ పూణె జెయిట్స్ జట్టులో ఉన్నాడు. అప్పుడు ఆ జట్టుకు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించాడు. తాజాగా ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి కెప్టెన్‌గా వ్యవహరించడం కొంచెం కష్టంగా అనిపించిందని పేర్కొన్నాడు.
ఏం ఆశించాలో తెలియలేదు..
2017 ఐపీఎల్ సీజన్‌లో రైజింగ్ పూణె జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఒక్క పరుగు తేడాతో టైటిల్‌కు దూరమైంది. అయితే నాడు జట్టుకు తనను సారథిగా నియమించాలని అనుకుంటున్నట్లు చెప్పగానే కొంచెం కష్టంగా అనిపించిందని స్మిత్ తెలిపాడు. ఎందుకంటే జట్టులో ధోనీ ఉన్నాడని పేర్కొన్నాడు. ‘‘ఆ సీజన్లో ధోని అద్భుతంగా ఆడాడు. అన్ని రకాలుగా అతను నాకు సహాయం అందించాడు. అతనో గొప్ప వ్యక్తి అతనికి సారథ్యం వహించడం గొప్ప అనుభవం. కానీ చాలా కష్టం కూడా. ధోని నుంచి ఏం ఆశించాలో మొదట్లో నాకు తెలియలేదు’ అని వివరించాడు.

ఆడిన అన్ని జట్లకు సారథిగా..
ధోని ఐసీఎల్ ఆడిన అన్ని జట్లుకు సారథిగా వ్యవహించాడు. ప్రతీ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2017లో మాత్రం పూణె తరఫున ఆడాడు. అప్పుడు స్మిత్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే పూణె జట్టుకు తను కెప్టెన్‌గా ఉండమన్నప్పుడు షాక్ అయ్యానని, అది తనకు కాస్త వింతగా అనిపించిందని స్మిత్ తెలిపాడు. ‘ఏం చెప్పాలో అర్థంకాలేదు. కెప్టెన్సీ గురించి ధోనీతో మాట్లాడారా’ అని అడిగానని చెప్పాడు. కానీ ఆ తర్వాత ‘అన్నీ సరిచేసుకున్నాం. ధోని అదరగొట్టాడు. అతను నాకు సహాయం చేసిన పద్ధతి.. జట్టుకు మార్గనిర్దేశనం చేయడంలో తోడ్పడిన విధానం అసాధారణం’ అని తెలిపాడు. అందుకు ధోనీకి తగినంతగా కృతజ్ఞతలు చెప్పలేకపోయా‘ అని స్మిత్ వివరించాడు. ఇదిలా ఉంటే ఈసారి స్మితన్ను ఏ జట్టు తీసుకోలేదు. దీంతో అతడు ఐపీఎల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.