Star Kids Dance : ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లలు చాలా ఫేమస్. వీళ్ళ వయస్సు చిన్నది అయినప్పటికీ వీళ్లు హీరో, హీరోయిన్లకు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఈ స్టార్ కిడ్స్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇక ఈయన పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ల గురించి కూడా ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇప్పటికే వీరిద్దరూ సామాజిక మాధ్యమాల్లో స్టార్ కిడ్స్ గా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తమ పిల్లలు అయాన్, అర్హతల గురించి ఏ విషయమైనా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అల్లు స్నేహారెడ్డి తన పిల్లలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పిల్లలు ఇద్దరు క్యూట్ గెటప్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. తన క్లాస్ పిల్లలతో కలిసి ఎంతో హుషారుగా, ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారు. అల్లు అయాన్, అల్లు అర్హ తమ స్కూల్ ఈవెంట్లో ఇలా డిఫరెంట్ గెటప్ లో డాన్స్ చేస్తున్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలో అర్హ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక అల్లు అయాన్ కూడా అల్లరి చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియో అందరి దృష్టిని తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ క్యూట్ కిడ్స్ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. దాదాపు రూ. 1800 కోట్ల పైన కలెక్షన్లు సాధించి భారత దేశంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండవ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జతగా హీరోయిన్ రష్మిక మందన నటించింది. సునీల్, జగపతిబాబు, అనసూయ, ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు.
థియేటర్లలో రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప2 ప్రస్తుతం ఓటీటీలో కూడా రికార్డులను కొల్లగొట్టే పనిలో ఉంది. ప్రముఖ ఓటీటి నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ లో ఉంది. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను అందరు కూడా నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు
View this post on Instagram