Sreemukhi: స్టార్ యాంకర్ శ్రీముఖి సైలెంట్ గా ఎఫైర్ నడిపిస్తున్నారంటూ టాలీవుడ్ కోడై కూస్తుంది. ఈ ఏడాది పెళ్లి పీటలు కూడా ఎక్కనుందనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మీడియా కథనాలు ప్రకారం… శ్రీముఖి హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను ప్రేమిస్తున్నారట. చాలా కాలంగా రహస్యంగా వీరి ప్రేమాయణం నడుస్తుందట. విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు కలిసి మాట్లాడుకున్నారట. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారంటూ వినికిడి. శ్రీముఖి పెళ్లిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇక శ్రీముఖిని కట్టుకోబోయేవాడు బడా వ్యాపారవేత్త అట. కోట్లకు పడగలెత్తిన బిగ్ షాట్ ఇంటికి శ్రీముఖి ఇల్లాలిగా వెళుతున్నారట. శ్రీముఖి కెరీర్ ప్రస్తుతం ఉచ్చ స్థితిలో ఉంది. అరడజను షోలకు ఆమె యాంకర్ గా చేస్తున్నారు. ఇటీవల బీబీ జోడి పేరుతో స్టార్ మా లో డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. దానికి కూడా శ్రీముఖినే యాంకర్. డాన్స్ ఐకాన్ పేరుతో మొన్నటి వరకు ఆహాలో ఓ షో ప్రసారమైంది. సదరు షోకి శ్రీముఖి యాంకర్ కమ్ జడ్జిగా వ్యవహరించింది.
ఓటీటీ కంటెంట్ కి సెన్సార్ ఆంక్షలు కొంచెం తక్కువ. ఈ క్రమంలో శ్రీముఖి ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఆ షో కోసం శ్రీముఖి వేసుకున్న బట్టలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. స్కిన్ షోలో బౌండరీలు దాటేసి బోల్డ్ నెస్ కి తెరలేపింది. ఒకప్పుడు శ్రీముఖి యాంకరింగ్ లో టాప్ 5 లో ఉండేది. ఇప్పుడు షోస్ పరంగానే ఆమెనే నంబర్ వన్. సుమ కూడా శ్రీముఖి చేస్తునన్ని షోలు చేయడం లేదు. గ్లామరస్ యాంకర్స్ కి డిమాండ్ పెరుగుతుండగా సుమ లాంటి వారు కూడా రేసులో వెనుకబడుతున్నారు.

నెలకు కోట్లలో సంపాదిస్తున్న శ్రీముఖి ఇటీవల నూతన గృహప్రవేశం చేశారు. సొంతింటి కల నెరవేర్చుకున్నారు. అమ్మానాన్న, తమ్ముడితో పాటు కొత్త ఇంటిలో పాలు పొంగించి అడుగుపెట్టారు. యాంకర్ గా రాణిస్తూనే నటిగా ఎదగాలని శ్రీముఖి ప్రయత్నాలు చేస్తుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. అలాగే ‘ఇట్స్ టైం టు పార్టీ’ టైటిల్ తో విడుదలైన మూవీలో కూడా శ్రీముఖి ప్రధాన రోల్ చేశారు. మెల్లగా శ్రీముఖికి వెండితెర ఆఫర్స్ పెరుగుతున్నాయి.