https://oktelugu.com/

‘Bheemla Nayak’ Movie First Review: ‘భీమ్లా నాయక్’ మూవీ ఫస్ట్ రివ్యూ..

‘Bheemla Nayak’ Movie First Review: ‘గబ్బర్ సింగ్’ మూవీతో ఇండస్ట్రీని పవన్ కళ్యాన్ ఏ రేంజ్ లో షేక్ చేశారో అందరికీ తెలిసిందే. అందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. అందులోనే కామెడీని జనరేట్ చేసిన విధానం అభిమానులను ఉర్రూతలూగించింది. అచ్చంగా అలాంటి గెటప్ నే ‘భీమ్లా నాయక్’ మూవీలో పవన్ మరోసారి ధరించారు. అలాంటి కామెడీ టైమింగ్ నే ప్రదర్శించారట.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన సంగీత దర్శకుడు ‘థమన్’ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 18, 2022 / 09:55 AM IST
    Follow us on

    ‘Bheemla Nayak’ Movie First Review: ‘గబ్బర్ సింగ్’ మూవీతో ఇండస్ట్రీని పవన్ కళ్యాన్ ఏ రేంజ్ లో షేక్ చేశారో అందరికీ తెలిసిందే. అందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. అందులోనే కామెడీని జనరేట్ చేసిన విధానం అభిమానులను ఉర్రూతలూగించింది. అచ్చంగా అలాంటి గెటప్ నే ‘భీమ్లా నాయక్’ మూవీలో పవన్ మరోసారి ధరించారు. అలాంటి కామెడీ టైమింగ్ నే ప్రదర్శించారట.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన సంగీత దర్శకుడు ‘థమన్’ ‘భీమ్లానాయక్’ మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. మరి థమన్ ఏం చెప్పాడు? మూవీ ఎలా ఉందనేది తెలుసుకుందాం..

    Bheemla Nayak’ Movie First Review

    ‘వకీల్ సాబ్’సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమా ‘భీమ్లా నాయక్’. పవన్ కళ్యాణ్, రానా జంటగా నటించిన ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ఫస్ట్ కాపీ చూసిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేశాయి.

    Also Read:

    1.  మూడో కూట‌మిలో జ‌గ‌న్ చేరతారా? కేసీఆర్ తో క‌లుస్తారా?
    2. అసెంబ్లీ సమావేశాలకు బద్దకమేనా ప్రజాప్రతినిధులూ?

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంగీత దర్శకుల్లో మొదటి స్థానంలో తమన్ ఉంటాడు. ఎప్పటికప్పుడు తాను బాణీలు కడుతూ భారీ సినిమాలపై అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆ సినిమా పట్ల ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తుంటాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీపై హుషారెత్తించే ఓ విషయాన్ని చెప్పారు. ‘త్రివిక్రమ్’తో కలిసి తాను ‘భీమ్లా నాయక్’ మూవీ చూశానని.. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని కుండబద్దలు కొట్టారు. ఇందులోని పవన్ కళ్యాణ్ డ్యాన్స్, కామెడీలకు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని.. జనాలు నవ్వకుండా ఉండలేరని స్పష్టం చేశారు.

    ‘భీమ్లా నాయక్’ మూవీ పవన్ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని థమన్ ఢంకా బజాయించి మరీ తెలిపాడు. ఈ సినిమాకు తన వరకూ బెస్ట్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నించానని తెలిపాడు.

    Also Read:

    1.  సొంత మ‌ర‌ద‌ళ్ల‌ను పెండ్లి చేసుకున్న స్టార్ హీరోలు వీరే..!
    2. మూడో కూట‌మిలో జ‌గ‌న్ చేరతారా? కేసీఆర్ తో క‌లుస్తారా?

    మలయాళ మూవీ ‘అయ్యప్పమ్ కోషియమ్’ మూవీకి తెలుగు రిమేక్ ‘భీమ్లా నాయక్’. పవన్, రానా, నిత్యమీనన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రధారులు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.