Sreemukhi Marriage: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై విపరీతమైన ఆసక్తి ఉంటుంది. సాధారణ జనాలు వారిని ప్రత్యేకంగా చూస్తారు. ముఖ్యంగా ప్రేమ-పెళ్లి వంటి విషయాపై విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వస్తాయి. కాగా ఇటీవల స్టార్ యాంకర్ శ్రీముఖి వివాహం అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ కి చెందిన ఒక వ్యాపారవేత్తను శ్రీముఖి వివాహం చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఇరు కుటుంబాల పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నారని, ఈ ఏడాది సదరు వ్యాపారవేత్తతో శ్రీముఖి వివాహం ఘనంగా జరగనుంది.. అంటూ వార్తలు వెలువడ్డాయి.

ఈ వార్తలపై శ్రీముఖి కొంచెం ఆలస్యంగా స్పందించారు. మాట్లాడుతూ… ఒకసారి పెళ్లి అంటూ, మరోసారి ప్రేమ అంటూ నిరాదరణ కథనాలు రాస్తున్నారు. మా నాన్న ఫోటో బ్లర్ చేసి నన్ను చేసుకోబోయేవాడని ప్రచురిస్తున్నారు. ఇవన్నీ విని నాకు విసుగొచ్చేసింది. నేను మరో మూడు నాలుగేళ్ళ వరకూ వివాహం చేసుకోను. నాకు పెళ్లి కుదిరినప్పుడు నిజంగా అందరికీ చెబుతున్నాను. దయచేసి పుకార్లు ప్రచారం చేయకండి.. అంటూ వివరణ ఇచ్చారు.
శ్రీముఖి ప్రకటన ఆమె ఫ్యాన్స్ లో జోష్ నింపింది. పెళ్లి చేసుకొని ఎక్కడ శ్రీముఖి బుల్లితెరకు, సోషల్ మీడియాకు దూరం అవుతుందో అని వారు దిగులుపడ్డారు. ఆమె గ్లామర్ ని మిస్ అవుతామని కంగారు పడ్డారు. శ్రీముఖి స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో మూడు నాలుగేళ్ళ వరకు శ్రీముఖి హవా సాగనుందని అర్థమైపోయింది. ప్రస్తుతం శ్రీముఖి టాప్ యాంకర్ గా ఉన్నారు. ఆమె చేస్తున్నన్ని షోలు మరొక యాంకర్ చేయడం లేదు.

సుమ, అనసూయ, రష్మీలను కూడా బీట్ చేసి శ్రీముఖి నంబర్ వన్ పొజిషన్ లోకి దూసుకెళ్లింది. అరడజను షోలు వరకు శ్రీముఖి ఖాతాలో ఉన్నాయి. ఇటీవల స్టార్ మా లో బీబీ జోడి పేరుతో ఓ డాన్స్ రియాలిటీ షో పరాభమైంది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఈ డాన్స్ రియాలిటీ షో నడుస్తుంది. యాంకరింగ్, ప్రమోషన్స్ ద్వారా శ్రీముఖి భారీగా సంపాదిస్తున్నారు. ఇటీవల గ్రాండ్ గా నిర్మించుకున్న ఇంటిలో అడుగు పెట్టారు. ఇక నటిగా కూడా ఎదగాలనే ప్రయత్నాలు ఆమె చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో శ్రీముఖి బోల్డ్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
