Srihan- Siri: వంద రోజులకు పైగా సాగిన ప్రయాణానికి తగిన ఫలితం పొందే వేళ శ్రీహాన్ నిర్ణయం మొత్తం నాశనం చేసింది. నాగార్జున ట్రాప్ లో శ్రీహాన్ పడ్డారు. పేరెంట్స్, తోటి కంటెస్టెంట్స్ కూడా శ్రీహాన్ ని తప్పుదోవ పట్టించారు. రేవంత్ విన్నర్ కావడం ఖాయమని నమ్మిన ప్రతి ఒక్కరు శ్రీహాన్ రూ. 40 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకోవడమే బెటర్ అని నమ్మారు. అందుకే శ్రీహాన్ ఆ డబ్బు తీసుకునేలా ఫోర్స్ చేశారు. శ్రీహాన్ కూడా టెంప్ట్ అయ్యాడనేది నిజం. అయితే అతడు అభిమానులు వేసిన ఓట్లు వృధా అవుతాయి, వాళ్ళ నమ్మకం కోల్పోతామని ఆలోచించి డబ్బులు వద్దన్నారు.

చివరికి పేరెంట్స్ కూడా తీసుకోమని సలహా ఇవ్వడంతో శ్రీహాన్ సూట్ కేసు తీసుకొని రేసు నుండి తప్పుకున్నాడు. ఫైనల్ గా రేవంత్ కంటే అధికంగా తనకు ఓట్లు వచ్చాయని, టైటిల్ విన్నర్ తానే అని తెలిసి శ్రీహాన్ మైండ్ బ్లాక్ అయ్యింది. నాగార్జున కామెంట్స్ ని శ్రీహాన్ ఎంజాయ్ చేశాడు. వేదికపై సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఒక వేళ నాగార్జున ఆఫర్ కి తలొగ్గక పోతే, ఎవరు చెప్పినా దృఢంగా మొదటి నిర్ణయానికి కట్టుబడి ఉంటే… రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు, రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్, రూ. 10 లక్షల విలువైన కారు సొంతం అయ్యేవి.
ఏది ఏమైనా గతాన్ని మార్చలేం. కీలక నిర్ణయాలు ఎంతటి మార్పుకు కారణం అవుతాయో ఈ సంఘటన ఒక ఉదాహరణ. మరి గెలుచుకున్న రూ. 40 లక్షలు శ్రీహను ఏం చేయనున్నారు. ఎలా ఖర్చు చేయనున్నారో? ఆయనే స్వయంగా చెప్పారు. సిరికి ఒక మంచి గిఫ్ట్ కొనివ్వాలి. ఎందుకంటే ఆమెకు ఎన్నడూ విలువైన బహుమతి ఇవ్వలేదు. ఈ ప్రైజ్ మనీ నుండి సిరికి మంచి గిఫ్ట్ కొంటాను, అన్నాడు. అలాగే ఇల్లు కట్టుకోవాలని శ్రీహాన్ చెప్పారు. సువర్ణ భూమి వారు 50% తగ్గింపు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో సొంతింటి కల నెరవేర్చుకోవడానికి మిగతా డబ్బులు వాడతానని శ్రీహాన్ చెప్పారు.

గెలిచిన డబ్బులో ఫస్ట్ ప్రయారిటీ సిరికి ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు శ్రీహాన్. ఇక అతడి విజయంలో సిరి కీలక పాత్ర పోషించారు. టైటిల్ గెలవడం ముఖ్యమని ఫ్యామిలీ వీక్ లో పేరెంట్స్ కాకుండా సిరి హౌస్లోకి ఎంటర్ అయ్యింది. తన నెగటివ్ పాయింట్స్ చెప్పడంతో పాటు గేమ్ ఎలా ఆడాలో చెప్పారు. మిగతా కంటెస్టెంట్స్ కి జనాల్లో ఉన్న అభిప్రాయం, తన గురించి ఏమనుకుంటున్నారో చెప్పి చక్కగా గైడ్ చేసింది. ఫ్యామిలీ వీక్ తర్వాత శ్రీహాన్ గేమ్ బాగా మారిపోయింది.