Bigg boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు రోజుకో కొత్త మలుపు తీసుకుంటూ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది..ఇక ఈవారం కెప్టెన్సీ టాస్కు ఎంత ఆసక్తికరంగా సాగిందో మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా ‘చేపల చెరువు’ టాస్కులో ఇంటి సభ్యులందరు చెలరేగిపొయ్యి ఆడారు..ఈ సీజన్ మొత్తంలో హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇంటి సభ్యులు ఒక టాస్కులో ఇంతలా ఆడడం ఎప్పుడు చూడలేదు..TRP రేటింగ్స్ కూడా అదిరిపోయాయి.
ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి తరుచు గొడవలు పడుతూ ఉండే శ్రీహాన్ మరియు ఇనాయ సుల్తానా గత కొంతకాలం నుండి స్నేహం గా ఉంటూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..కానీ హౌస్ లో జరిగిన కొన్ని సందర్భాలలో ఇనాయ సుల్తానా శ్రీహాన్ కి వెన్నుపోటు పొడుస్తూ వచ్చింది..నామినేషన్స్ లోను మరియు కెప్టెన్ ని ఎంచుకునే విషయం లోను ఇనాయ సుల్తానా శ్రీహన్ ని టార్గెట్ చేస్తూ వచ్చింది..ఇది శ్రీహాన్ కి బాగా కోపం తెప్పించింది.
ఊసరవెల్లి కంటే దారుణంగా రోజుకో రంగు మారుస్తుంది..నా సమయం వచ్చినప్పుడు నేనేంటో ఆమెకి చూపిస్తా..ఈసారి ‘సర్కాసిం’ ఉండదు..’నరకాసిమ్’ ఉంటుంది అంటూ శ్రీసత్య తో నిన్న శ్రీహాన్ చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇక ఈ వారం కెప్టెన్ గా శ్రీహాన్ ఎన్నిక అయ్యాడు..కెప్టెన్సీ చేతికి రాగానే ఇనాయ సుల్తానా భరతం పట్టడం ప్రారంబించాడు శ్రీహాన్..’ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు’ అని ఇంటి సభ్యులతో చర్చిస్తున్న సమయం లో ఇనాయ కల్పించుకొని ‘నేను కర్రీ లేకనే రైస్ ని పక్కన పడేసాను కానీ కావాలని కాదు’ అంటూ జవాబిస్తుంది.
‘అన్నం కి నువ్వు ఇచ్చే విలువ అదేనా’ అంటూ శ్రీహన్ ఇనాయ కి క్లాస్ పీకుతాడు..నేను హౌస్ మేట్స్ కి క్లారిటీ ఇస్తున్నాను..నీకు కాదు అంటూ ఇనాయ శ్రీహన్ కి బదులు సమాధానం చెప్పడం తో ‘నువ్ క్లారిటీ ఇచ్చుకోవాలంటే వేరే సమయం లో ఇచ్చుకో..ఇది నా టైం..గమ్మున ఉండు’ అంటూ వార్నింగ్ ఇస్తాడు..’ఎవరైనా ఇంట్లో ఫుడ్ వేస్ట్ చేస్తే అసలు ఊరుకునేది లేదు’ అంటూ హౌస్ మేట్స్ అందరికి వార్నింగ్ ఇస్తాడు శ్రీహాన్. ఇలా కెప్టెన్ అవ్వగానే శ్రీహాన్ రెచ్చిపోయాడు. ముఖ్యంగా తనను చీట్ చేసిన ఇనాయాకు ఇచ్చిపడేశాడు.