Sri Satya: బిగ్ బాస్ ఫేమ్ శ్రీసత్య బాత్రూమ్ లో హాట్ ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రైవేట్ ఫోటోలను తలపిస్తున్న శ్రీసత్య లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

సీరియల్ నటి శ్రీసత్య బిగ్ బాస్ తెలుగు 6లో పాల్గొన్నారు. ఆమె తన గ్లామర్, ఆటతీరుతో ప్రేక్షకులను అలరించారు. మొదటి వారాల్లో ఎవరితో మాట్లాడకుండా శ్రీసత్య సైలెన్స్ మైంటైన్ చేశారు. బ్రేకప్ కారణంగా తాను జనాల్లో కలవలేకపోతున్నట్లు వెల్లడించారు.
వారాలు గడిచేకొద్దీ ఆమె తన ఆట తీరు మెరుగుపరుచుకున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగి ఫైనల్ వీక్ లో అడుగుపెట్టారు. అనూహ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్తో ఆమె హౌస్ వీడారు. ఫైనల్ కి ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే వెళ్ళాలి అనేది బిగ్ బాస్ నియమం కాగా, శ్రీసత్యను ఎలిమినేట్ చేశారు.
స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ శ్రీసత్య నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఈ సీజన్లో అత్యంత పెద్ద మొత్తంలో విమర్శలు ఎదుర్కొన్న కంటెస్టెంట్ శ్రీసత్య. ఇతరులను వాడుకుంటూ ఆమె గేమ్లో ముందుకు వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. అర్జున్ కళ్యాణ్ ఆమె కారణంగానే ఎలిమినేట్ అయ్యాడన్న వాదన వినిపించింది.

అలాగే ఫ్రెండ్షిప్ పేరుతో శ్రీహాన్ కి ఆమె దగ్గరయ్యారు. శ్రీసత్య కోసం శ్రీహాన్ సైతం త్యాగాలు చేస్తూ తన గేమ్ కోల్పోయాడు. ఈ దశలో శ్రీహాన్ లవర్ సిరి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి అతని గేమ్ సరి చేసింది. అలాగే శ్రీహాన్ తో సన్నిహితంగా ఉంటున్న శ్రీసత్యకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
ఎంత నెగిటివిటీ ఫేస్ చేసినప్పటికీ ఆమెకంటూ కొందరు అభిమానులు ఏర్పడ్డారు. శ్రీసత్యను దాదాపు ఫినాలే వరకు తీసుకెళ్లారు. అలాగే ఫ్యామిలీ వీక్ శ్రీసత్యకు కలిసొచ్చింది. వీల్ చైర్ లో వచ్చిన వాళ్ళ అమ్మగారిని చూసి శ్రీసత్య మీద ఆడియన్స్ లో సింపతీ పెరిగింది. ఆ కారణంగా ఆమె మరి కొన్ని వారాలు హౌస్లో ఉండే ఛాన్స్ దక్కించుకున్నారు.
తాను ఎంతగానో ఇష్టపడిన శ్రీహాన్ రన్నర్ గా నిలిచాడు. ఫ్రెండ్ రేవంత్ టైటిల్ అందుకున్నారు. బిగ్ బాస్ షోతో వచ్చిన ఫేమ్ తో శ్రీసత్యకు ఆఫర్స్ పెరుగుతాయని ఆమె ఆశిస్తున్నారు. అదే సమయంలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ మేకర్స్ ని ఆకర్షిస్తున్నారు. ఆమె స్నానాల గదిలో చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతుంది.